ETV Bharat / sitara

మరో మెలోడీతో సిద్ శ్రీరామ్.. 'హౌజ్ అరెస్ట్' రిలీజ్ ఫిక్స్

author img

By

Published : Aug 16, 2021, 2:17 PM IST

.
.

మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మంచిరోజులు వచ్చాయి, హౌజ్ అరెస్ట్, భూమిక, 7 డేస్ 6 నైట్స్, శ్రీదేవి సోడా సెంటర్, క్రేజీ అంకుల్స్ చిత్ర విశేషాలు ఉన్నాయి.

*సంతోశ్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. మారుతి దర్శకుడు. ఇందులోని 'సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే' అంటూ సాగే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్‌ నటించిన 'హౌజ్‌ అరెస్ట్‌' రిలీజ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించగా, శేఖర్ యర్నా దర్శకత్వం వహించారు.

.
.

*ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్‌ చిత్రం 'భూమిక'. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్​ను సోమవారం విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'7 డేస్ 6 నైట్స్' సినిమా గోవా షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎం.ఎస్.రాజు వెల్లడించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

.
.
.
.
.
.
.
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.