ETV Bharat / sitara

''పాడుతా తీయగా' గాయకుల్ని ఆదరించే బాధ్యత మీదే'

author img

By

Published : Nov 29, 2021, 6:27 PM IST

Updated : Nov 29, 2021, 6:46 PM IST

సింగర్ సునీత పాడుతా తీయగా, singer sunitha paduta theeyaga
సింగర్ సునీత పాడుతా తీయగా

singer sunitha padutha theeyaga: సరిగమల స్వరాలతో, ఆణిముత్యాల్లాంటి పాటలతో ప్రేక్షకుల మదిని మీటిన స్వరరాగ ప్రవాహం 'పాడుతా తీయగా'. తెలుగు లోగిళ్లలో పాటల పరిమళాలు వెదజల్లి సంగీత ప్రియులను ఓలలాడించింది. తెలుగు చిత్ర సీమకు కొత్త గళాలను పరిచయం చేసింది. సంగీత ప్రపంచంలో ఓ అద్భుతమైన కార్యక్రమంగా ముద్ర వేసుకున్న పాడుతా తీయగా.. స్వల్ప విరామం తర్వాత ఈటీవీలో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నేపథ్య గాయని సునీత ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఔత్సాహిక గాయనీ గాయకుల బంగారు భవిష్యత్​కు దారిచూపే గురతర బాధ్యత వీక్షకులకు కూడా ఉందని అన్నారు.

singer sunitha padutha theeyaga: సంగీత ప్రపంచంలో ప్రతిభావంతులైన గాయనీ గాయకులను గుర్తించి వారి భవిష్యత్​కు చక్కటి మార్గాన్ని నిర్దేశించే వేదిక 'పాడుతా తీయగా'. తెలుగింటి ఛానల్ ఈటీవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 1996 మే 16న మొదలై సుమారు 18 ఏళ్లపాటు ఎంతో వైభవంగా సాగిన ఈ పాటల పోటీ.. ఎందరో గాయనీ గాయకులను తయారు చేసింది. ఎంతో మంది సంగీత విద్వాంసుల ప్రశంసలందుకుంది. దక్షిణాదిన తొలి పాటల పోటీగా నిలిచి తెలుగు లోగిళ్లను సంగీతమయం చేసింది. చిన్నా పెద్దా.. ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేకుండా సప్తసముద్రాల ఆవల కూడా తన గానాన్ని వినిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని స్వల్ప విరామం తర్వాత మళ్లీ మొదలుపెట్టింది ఈటీవీ(padutha theeyaga 2021). ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'పాడుతా తీయగా'కు ప్రముఖ నేపథ్య గాయనీ సునీత, విజయ్ ప్రకాశ్, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

'పాడుతా తీయగా' న్యాయనిర్ణేతగా సింగర్​ సునీత

'పాడుతా తీయగా'తో ప్రత్యక్షంగా ఎంతో అనుభవాన్ని, అనుబంధాన్ని పెనవేసుకున్న నేపథ్య గాయనీ సునీత. తన మధురమైన గాత్రంతో ఎన్నో వేళ పాటలు పాడిన సునీత 'పాడుతా తీయగా'లో అప్పుడప్పుడు అతిథిగా వచ్చి ఔత్సాహిక గాయనీ గాయకులను సలహాలు సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేసేవారు. ఎస్పీబీతో కలిసి న్యాయనిర్ణేతగానూ విజేతలను ఎంపిక చేసిన అనుభవం ఆమెది. అలాంటి సునీత న్యాయనిర్ణేతగా మరోసారి పాడుతా తీయగా వేదికగా తన తియ్యనైనా మాటలు కమ్మనైనా పాటలతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. ఈసారి 'పాడుతా తీయగా'లో ఇప్పటి వరకు ఏ వేదికపై పాటలు పాడని కొత్త గాయనీ గాయకులను పరిచయం చేస్తున్నామని చెప్పారు. వారిలోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే తన బాధ్యత అని చెప్పిన సునీత.. ఔత్సాహిక గాయనీ గాయకుల బంగారు భవిష్యత్​కు దారిచూపే గురతర బాధ్యత కూడా వీక్షకులకు ఉందని అన్నారు.

ఇదీ చూడండి: సుస్వరాల 'పాడుతా తీయగా'.. ఇక ఎస్పీ చరణ్ సారథ్యంలో

Last Updated :Nov 29, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.