ETV Bharat / sitara

Viral: 'క్రాక్​' బ్యూటీతో పబ్​లో ఆర్జీవీ రచ్చ రచ్చ..!

author img

By

Published : Sep 10, 2021, 8:07 PM IST

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma). ఇప్పుడు 'క్రాక్​' ఐటెంగాళ్​(Krack Item Girl) అప్సర రాణి అందాన్ని ట్విట్టర్​ వేదికగా వర్ణించాడు. ఆమెతో పాటు ఓ పబ్​కు వెళ్లి డీజే పాటకు సరదాగా చిందులేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Ram Gopal Varma romance with Krack Item Girl Apsara Rani video goes viral
'క్రాక్​' బ్యూటీతో పబ్​లో చిందులేసిన ఆర్జీవీ!

సినిమాలతో పాటు, సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV). ఇప్పుడు 'క్రాక్​' ఐటెంగాళ్​(Krack Item Girl) అప్సర రాణితో కలిసి ఓ పబ్​లో చిందులేశాడు. దాంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ట్విట్టర్​ వేదికగా వరుసగా పోస్ట్​ చేస్తూ వచ్చాడు. అయితే ఆ పబ్​లో వాళ్లిద్దరూ ఏం చేశారు? అనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆ మధ్య 'బోల్డ్‌ ఇంటర్వ్యూ' (RGV interview) అంటూ అరియానాతో వర్మ చేసిన సందడి చూశాం. ఇటీవలే బిగ్​బాస్​ కంటస్టెంట్​ అషురెడ్డితో అలాంటి ఓ ఇంటర్వ్యూనే ప్లాన్‌ చేశాడు. కానీ, ఈసారి కొత్తగా 'క్రాక్​' ఐటెంగాళ్​ అప్సర రాణితో కలిసి సరదాగా పబ్​కు వెళ్లాడు. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలతో పాటు డీజే సాంగ్​కు ఆమె చిందులేసిన వీడియోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి.. రామ్​గోపాల్ వర్మ చెంప పగలగొట్టిన నటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.