ETV Bharat / sitara

షారుక్​ సినిమా నుంచి తప్పుకున్న నయనతార!

author img

By

Published : Oct 27, 2021, 3:45 PM IST

బాలీవుడ్​ స్టార్​ షారుక్​-దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి హీరోయిన్ నయనతార(nayanthara shahrukh khan movie)​ తప్పుకున్నట్లు సమాచారం. డేట్స్​ సర్దుబాటు కాక నయన్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

nayan
నయన్​

హీరోయిన్​ నయనతార(nayanthara shahrukh khan movie).. బాలీవుడ్​ స్టార్​ షారుక్​ ఖాన్​-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడా చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం(nayanthara shahrukh khan).

కారణమిదేనా?

అట్లీ దర్శకత్వంలో షారుక్​ నటిస్తున్న సినిమా.. షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కొద్ది రోజుల క్రితం బాద్​షా తనయుడు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ కేసులో జైలుకెళ్లారు. దీంతో షారుక్​ తన షూటింగ్స్​కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అట్లీ రూపొందిస్తున్న సినిమా చిత్రీకరణ నిలిచిపోయినట్లు తెలిసింది. ఈ మూవీ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో స్పష్టత లేదు.

మరోవైపు నయన్(nayanthara vignesh wedding)​.. తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్​తో పెళ్లి పనుల్లో బిజీగా ఉందట! ఈ కారణాలతో తన డేట్స్​ సర్దుబాటు కాక ఆమె షారుక్​ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఇదీ చూడండి: ఆస్కార్ బరిలో నయన్, విఘ్నేశ్ చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.