ETV Bharat / sitara

ఆస్కార్ బరిలో నయన్, విఘ్నేశ్ చిత్రం

author img

By

Published : Oct 23, 2021, 4:50 PM IST

తమిళ చిత్రం 'కూజంగల్' ఆస్కార్​ బరిలో నిలిచింది. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేశ్​ శివన్​ కలిసి రౌడీ పిక్చర్స్​ బ్యానర్​పై నిర్మించారు. అంతకుముందు టైగర్ అవార్డు సాధించిన తొలి తమిళ చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది.

nayan
నయన్​

తమిళ సినిమా 'కూజంగల్'కు​ అరుదైన గౌరవం లభించింది. 94వ అకాడమీ అవార్డ్స్​ విదేశీ చిత్రాల కేటగిరిలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేశ్​ శివన్​ కలిసి రౌడీ పిక్చర్స్​ బ్యానర్​పై నిర్మించారు. పీఎస్ వినోద్ రాజ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా టైగర్ అవార్డు ఫిల్మ్​ ఫెస్టివల్​లో సత్తాచాటింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​లోనూ ప్రదర్శించబడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేశ్​ శివన్​ హర్షం వ్యక్తం చేశారు.

భారత్​ తరఫున అధికారిక ఎంట్రీ కోసం 14 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో హిందీ చిత్రాలు 'షేర్నీ', 'సర్దార్​ ఉద్ధమ్'. 'మండేలా'(తమిళం), 'నాయాట్టు'(మలయాళం) పోటీ పడ్డాయి. ఈ చిత్రాలను దాటి మన దేశం తరఫున 'కూజంగల్'​ ఆస్కార్​కు నామినేట్​ అవ్వడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 27 ఆస్కార్​ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​లో తమిళ చిత్రం రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.