ETV Bharat / sitara

'విరాట పర్వం' స్పెషల్​ వీడియో.. 'బంగార్రాజు', 'ఖిలాడి' అప్డేట్స్​

author img

By

Published : Dec 14, 2021, 11:57 AM IST

Cinema Updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాగార్జున 'బంగార్రాజు', రానా 'విరాటపర్వం', రవితేజ 'ఖిలాడి', రామ్​ పోతినేని-లింగుస్వామి చిత్రాల సంగతులు ఉన్నాయి.

రానా విరాటపర్వం​, Rana virataparvam
రానా విరాటపర్వం

Nagarjuna Bangarraju Movie: 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న సినిమా 'బంగార్రాజు'. ఈ చిత్రంలోని 'పార్టీ సాంగ్​ ఆఫ్​ ది ఇయర్'కు సంబంధించిన మ్యూజికల్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. డిసెంబరు 17న టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. ఈ మూవీకి కల్యాణ్​కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. ​అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. నాగ్​తో పాటు నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'ది వాయిస్​ ఆఫ్​ రవన్న'

Virata Parvam Movie Rana: నేడు రానా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'విరాట పర్వం' నుంచి 'ది వాయిస్​ ఆఫ్​ రవన్న' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, నందితాదాస్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హ్యాపీ బర్త్​డే ఆది

Rampotineni Lignuswamy Movie: రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో 'RAP019'(వర్కింగ్​ టైటిల్​) సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు ఆది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా.. 'ఉప్పెన' హీరోయిన్‌ కృతిశెట్టి హీరోయిన్​గా చేస్తోంది. మరో భామ అక్షరగౌడ ప్రత్యేక ఆకర్షణ కానుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఆది నటిస్తున్న క్లాప్​, గుడ్​లక్​ సఖి మూవీ టీమ్స్​ కూడా ఆయనకు విషెస్​ తెలుపుతూ కొత్త పోస్టర్స్​ను విడుదల చేశాయి.

ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్​, Rampotineni Lignuswamy Movie
ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్​
ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్,​ good luck sakhi movie aadi poster
ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్​
ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్​, clap movie aadi poster
ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్​

సాంగ్​ షూటింగ్​

Raviteja Khiladi movie Release date: రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖిలాడి'. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మిగిలి ఉన్న పాటల చిత్రీకరణను పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే రవితేజ, మీనాక్షిలపై తెరకెక్కించనున్న గీతానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్​ చేశారు దర్శకుడు రమేశ్ వర్మ. 'షూటింగ్​ ఇన్​ ప్రోగ్రెస్'​ అని వ్యాఖ్య జోడించారు. విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ దేవీశ్రీ సంగీతమందిస్తున్నారు.

రవితేజ ఖిలాడి, raviteja khiladi
రవితేజ ఖిలాడి

ట్రైలర్​ రిలీజ్​

హాస్యనటుడు సప్తగిరి నటించిన 'గూడుపుఠాణి' చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన ట్రైలర్​ను కూడా విడుదల చేసింది. ఈ మూవీకి కేఎమ్​ కుమార్​ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శాన్వీమేఘన.. ఈ తెలుగమ్మాయి టాలీవుడ్​ ఏంజెల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.