ETV Bharat / sitara

'బంగార్రాజు' టీజర్.. శివకార్తికేయన్ తెలుగు సినిమా ఫిక్స్

author img

By

Published : Jan 1, 2022, 12:26 PM IST

Updated : Jan 1, 2022, 1:13 PM IST

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కోలీవుడ్​ హీరో శివకార్తికేయన్ తొలి తెలుగు సినిమా, శ్యామ్​సింగరాయ్, గ్యాంగ్​స్టర్ గంగరాజు, రామ్​ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

Bangarraju teaser sivakarthikeyan
బంగార్రాజు శివకార్తికేయన్

#SK20: తమిళ హీరో శివకార్తికేయన్.. తాను చేయబోయే తొలి తెలుగు సినిమా ప్రకటించారు. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సురేశ్​ ప్రొడక్షన్స్-శ్రీ వెంకటేశ్వర సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో హీరోయిన్, ఇతర నటీనటులతోపాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Bangarraju teaser: నాగార్జున-నాగచైతన్య 'బంగార్రాజు' టీజర్ రిలీజైంది. న్యూ ఇయర్​ సందర్భంగా శనివారం దీనిని అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతిశెట్టి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. తొలి పార్ట్​కు దర్శకత్వం వహించిన కల్యాణ్​కృష్ణ దీనిని తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో నాగార్జునే స్వయంగా నిర్మించారు.

'శ్యామ్​సింగరాయ్' సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా 'రైజ్ ఆఫ్ శ్యామ్​సింగరాయ్' పూర్తి వీడియో సాంగ్​ రిలీజ్ చేశారు. హీరోను ఎలివేట్​ చేసేలా ఉన్న లిరిక్స్.. శ్రోతల్ని అలరిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. జనవరి చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కావొచ్చని సమాచారం.

రామ్-లింగుస్వామి కాంబినేషన్​లో తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్​ మొదలైంది. కొత్త సంవత్సరం విషెస్​ చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్​గా చేస్తోంది. మరోవైపు లక్ష్ హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్​స్టర్ గంగరాజు' టీజర్ కూడా శనివారమే విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ram krithi shetty movie
రామ్-కృతిశెట్టి మూవీ

ఇవీ చదవండి:

Last Updated :Jan 1, 2022, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.