ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్​కు బ్యాడ్​న్యూస్.. సినిమా మళ్లీ వాయిదా!

author img

By

Published : Jan 1, 2022, 9:43 AM IST

Updated : Jan 1, 2022, 4:27 PM IST

RRR postponed: కొత్త సంవత్సరం తొలిరోజే సినీ ప్రేమికులను కలవరపరిచే వార్త ఇది. జనవరి 7న రావాల్సిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నారట. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

rrr movie
ఆర్ఆర్ఆర్ వాయిదా

RRR movie: కొత్త సంవత్సరంలోకి అందరూ అడుగుపెట్టేశారు. తెలుగు కొత్త సినిమాల పోస్టర్లు రిలీజ్ చేస్తూ చిత్రబృందాలు బిజీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో రాత్రి నుంచి ఓ వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అదే 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా!

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతున్న దృష్ట్యా.. దిల్లీ తదితర రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేస్తుండగా, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో సినిమాహాళ్లను నడుపుతున్నారు. రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా 'ఆర్ఆర్ఆర్' వాయిదా వేయాలని చూస్తున్నారట. దీనిపై త్వరలో ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

చూడాలి మరి ఈ వార్తలో నిజమెంత. రెండు రోజుల క్రితం సినిమా చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని స్పష్టం చేసిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు ఏం చేస్తారా అని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.

ram charan rajamouli ntr
రామ్​చరణ్-రాజమౌళి-ఎన్టీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.