ETV Bharat / sitara

డిప్రెషన్​లోకి వెళ్లా.. రాజమౌళి వల్లే కోలుకున్నా: ఎన్టీఆర్

author img

By

Published : Dec 30, 2021, 10:16 PM IST

rajamouli ntr
రాజమౌళి ఎన్టీఆర్

NTR Rajamouli: కెరీర్​ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులు, రాజమౌళి వల్ల దాని నుంచి బయటపడిన విషయం గురించి ఎన్టీఆర్ చెప్పారు. రాజమౌళితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

RRR Rjamaouli: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న ఎన్టీఆర్‌.. తన వ్యక్తిగత విషయాన్ని ఓపెన్‌గా పంచుకున్నారు. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని చెప్పారు. ఒకానొక సందర్భంలో డిప్రెషన్‌లోకి వెళ్లానని, అందులోంచి బయటపడడానికి రాజమౌళినే కారణమని అన్నారు.

ntr
ఎన్టీఆర్

"18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాను. రెండో సినిమాకే స్టార్‌ స్టేటస్‌ చూశాను. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‌కు గురయ్యా. సినిమా విజయం సాధించనందుకు బాధపడలేదు. భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యాను. అపజయాన్ని కష్టంగా భావించాను. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయేవాడిని. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది రాజమౌళినే. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు.. చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు" అని ఎన్టీఆర్‌ చెప్పారు.

దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.