ETV Bharat / sitara

RRR Pre Release Event: ఎన్టీఆర్​ నాలో సగభాగం: రామ్ చరణ్

author img

By

Published : Dec 30, 2021, 9:02 AM IST

RRR Pre Release Event: ఎన్టీఆర్​ తనలో సగభాగమని చెప్పారు మెగా పవర్​స్టార్ రామ్ చరణ్. అతడు లేనిదే 'ఆర్ఆర్​ఆర్'​ లేదని కేరళలో ప్రీ రిలీజ్​ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. చరణ్​ కూడా తనలో సగభాగమని, హృదయం ఎక్కడుందో చరణ్ అక్కడే ఉంటాడని చెప్పారు తారక్.

RRR pre release event
ఆర్‌ఆర్‌ఆర్‌

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అన్ని భాషల్లోనూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇటీవల చెన్నై ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌ బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో వేడుకను నిర్వహించింది. మలయాళ నటుడు టొవినో థామస్‌ ('మిన్నల్‌ మురళి' ఫేమ్) ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్ మాట్లాడారు.

RRR pre release event
'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

రాజమౌళి మాట్లాడుతూ.. "ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత దానయ్యగారికి ధన్యవాదాలు. నాతో ఓ సినిమా చేసేందుకు ఆయన చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. తన చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలవుతుంటే దర్శకుడికి అంతకుమించిన ఆనందం ఏముంటుంది. నా సినిమాల్ని అన్ని భాషలవారు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 'ధీర', 'ఈచ', 'బాహుబలి' చిత్రాలకు కేరళలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కేరళ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ సుమారు 25 రోజులు 'సింహాద్రి' సినిమా చిత్రీకరించాం" అని నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. వేడుకకు విచ్చేసిన టొవినో థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RRR pre release event
రామ్ చరణ్

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. "నా 'ధీర' (మగధీర) సినిమాను మీరెంతగానో ఆదరించారు. కానీ, మీ ప్రేమకు కానుకగా ఎలాంటి వేడుకల్ని నిర్వహించలేకపోయాం. 'చరణ్‌ కేరళ ప్రజలు నీపై ఎంతో ప్రేమ కురిస్తున్నారు. నవ్వు తప్పకుండా అక్కడికి వెళ్లాలి' అని రాజమౌళి చెప్తుండేవారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో అది ఇప్పుడు కుదిరింది. కేరళ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడి ఆహారం నాకెంతో ఇష్టం. మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన టెక్నిషియన్స్‌ ఉన్నారు. మేం.. మీ దర్శకులు, నటులను ఇష్టపడతాం. మీ సినిమాల నుంచి మేం స్ఫూర్తిపొందుతాం. ఎన్టీఆర్‌ నాలో సగభాగం. తను లేనిదే ఈ చిత్రం లేదు" అని అన్నారు.

RRR pre release event
ఎన్టీఆర్

జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. "చలన చిత్ర పరిశ్రమకు తమిళనాడు (తమిళ చిత్ర పరిశ్రమ) షెల్టర్‌ ఇస్తే టెక్నాలజీ విషయంలో కేరళ (మలయాళ చిత్ర పరిశ్రమ) జన్మనిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమకు ఎంతోమంది గ్రేట్‌ టెక్నీషియన్లను అందించింది. రాజమౌళి చెప్పినట్టుగా 'సింహాద్రి' కొంతభాగం షూటింగ్‌ ఇక్కడే జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. అతిథిగా విచ్చేసిన నా బ్రదర్‌ టొవినో థామస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వల్ల నేనూ చరణ్‌ స్నేహితులం కాలేదు. అంతకు ముందే మేం ఫ్రెండ్స్‌. మా స్నేహం వల్లే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సాధ్యమైంది. 200 రోజులు నా సోదరుడి (చరణ్‌)తో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా. మా బంధం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. మేమెప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా" అని అన్నారు.

RRR pre release event
టొవినో థామస్​తో 'ఆర్‌ఆర్‌ఆర్‌' యూనిట్

ఇదీ చూడండి:

ఏ డైరెక్టర్​కు నేను అలా చెప్పలేను: హీరో రామ్​చరణ్

'రాజమౌళితో పని చేయడం సవాల్.. కష్టమైనా ఇష్టపడి చేశా'

'ఆర్ఆర్ఆర్' రిలీజ్​పై సందేహాలు.. రాజమౌళి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.