ETV Bharat / sitara

ఈ బాలీవుడ్​ స్టార్స్​ది​ మనదేశం కాదంటే నమ్మగలరా?

author img

By

Published : Jun 14, 2020, 2:41 PM IST

ఈ బాలీవుడ్​ స్టార్స్​ది​ మనదేశం కాదంటే నమ్మగలరా?
బాలీవుడ్ సినిమా స్టోరీ

బాలీవుడ్​లోని కొందరు నటులకు భారత పౌరసత్వం లేదు. అయినా సరే ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం. అలాంటి వారిలో ఐదుగురు గురించిన విశేషాలు మీకోసం.

మీరు బాలీవుడ్​లు సినిమాలు చూస్తారా? అయితే మీకో ప్రశ్న. అందులో కనిపిస్తున్న కొందరు స్టార్స్​ది మనదేశం కాదు. కనీస భారతీయ పౌరసత్వం లేదు. అయినా సరే ఇక్కడ నటిస్తూ మనల్ని అలరిస్తున్నారు. అంతులేని వినోదాన్ని అందిస్తున్నారు. కానీ ఈ విషయం మీకు ఇప్పటివరకు తెలిసుండకపోవచ్చు. ఇంతకీ వారు ఎవరు? ఏయే దేశాలకు చెందినవారు? ఇలాంటి సంగతుల సమాహారమే ఈ కథనం.

ఆలియాభట్

'స్టూడెంట్​ ఆఫ్ ది ఇయర్' సినిమాతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.. తక్కువ సమయంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్​ చిత్రాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే లండన్​లో పుట్టి పెరిగిన ఈమెకు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. తండ్రి మహేశ్​భట్​ భారత్​లోని ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి సోనీ రజ్దాన్.. బ్రిటీష్ నటి.

alia bhatt
ఆలియా భట్

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్.. భారత్​లో జరిగిన ఎన్నికల్లో మీరు ఎప్పుడైనా ఓటు వేయడం చూశారా? బహుశా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అతడు పంజాబ్​లోని అమృత్​సర్​లో పుట్టి పెరిగినా, కెనడా పాస్​పోర్ట్​ కోసం భారత పౌరసత్వాన్ని వదలుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడే ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. 2016లో 'రుస్తుమ్' సినిమాకుగాను జాతీయ నటుడిగా అవార్డును అందుకోవడం విశేషం.

akshay kumar
అక్షయ్ కుమార్

కత్రినా కైఫ్

బాలీవుడ్​లో అత్యధిక రెమ్యునరేషన్​ తీసుకునే నటీమణుల్లో కత్రినాకైఫ్ ముందుంటుంది. గత కొన్నేళ్లలో స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ.. ఎన్నో సూపర్​హిట్​లు తన ఖాతాలో వేసుకుంది. అయితే హాంగ్​కాంగ్​లో పుట్టిన పెరిగిన కత్రినాకు ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం ఉంది.

katrina kaif
కత్రినా కైఫ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

2009లో 'అల్లాదీన్'తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్​గా, ప్రత్యేక గీతాల్లో కనువిందు చేసింది. అయితే ఈమె శ్రీలంకకు చెందిన నటి. 2006లో ఆ దేశ మిస్ యూనివర్స్​గా నిలిచింది. అయితే ఈమె.. కెనడా, శ్రీలంక, మలేసియా మూలలున్న కుటుంబంలో జన్మించింది. బహ్రెయిన్​లో పెరిగింది.

jacqueline fernandez
జాక్వెలిన్ ఫెర్నాండెజ్

నర్గీస్ ఫక్రీ

'రాక్​స్టార్' అనే రొమాంటిక్ డ్రామాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది నర్గీస్ ఫక్రీ. ఆ సినిమాకుగాను ఫిల్మ్​ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత 'మద్రాస్ కేఫ్', 'హూస్​ఫుల్ 3' వంటి చిత్రాల్లో నటించింది. ఆసక్తికర విషయం ఏంటంటే న్యూయార్క్ నగరంలోని క్వీన్స్​లో పుట్టిన నర్గీస్​కు అమెరికా పౌరసత్వం ఉంది. ఈమె నాన్నది పాకిస్థాన్ కాగా, అమ్మది చెక్.

nargis fakhri
నర్గీస్ ఫక్రీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.