ETV Bharat / sitara

స్టార్ హీరో చిత్రబృందంలో ఇద్దరికి కరోనా

author img

By

Published : Jun 12, 2020, 10:36 AM IST

ఇటీవలే జోర్డాన్​ నుంచి తిరిగొచ్చిన 'అదుజీవితం' చిత్రబృందంలో ఇద్దరికి కరోనా సోకింది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్​​కు మాత్రం నెగిటివ్​ వచ్చింది.

స్టార్ హీరో చిత్రబృందంలో ఇద్దరికి కరోనా
హీరో పృథ్వీరాజ్

మలయాళ హీరో పృథ్వీరాజ్​ 'అదు జీవితం' చిత్రబృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది. షూటింగ్​ నిమిత్తం ఇటీవలే జోర్డాన్ నుంచి 58 మంది సభ్యులు భారత్​కు వచ్చారు. వారిలో 58 ఏళ్ల అనువాదకుడితో పాటు మరో వ్యక్తికి వైరస్​ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

అసలేం జరిగింది?

'అదు జీవితం' చిత్రీకరణ కోసం మార్చి రెండో వారంలో 58 మంది సభ్యుల బృందం జోర్డాన్​ వెళ్లింది. వాడి రమ్ ఎడారిలో కొన్ని సన్నివేశాలు తీశారు. సరిగ్గా అదే సమయంలో భారత్​తో పాటు ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి కారణంగా లాక్​డౌన్​ విధించారు. దీంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. 'వందే భారత్' మిషన్​లో భాగంగా మే 22న స్వదేశానికి తిరిగొచ్చారు. ఆ తర్వాత రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్​లో ఉన్నారు. వారందరికీ తాజాగా పరీక్షలు నిర్వహించగా, హీరో పృథ్వీరాజ్​కు నెగిటివ్ వచ్చింది. మిగిలిన వారిలో ఇద్దరికి వైరస్​ సోకినట్లు తేలింది.

Malayalam hero prithviraj
హీరో పృథ్వీరాజ్

'అదుజీవితం' అనే నవల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్​తో పాటు అమలాపాల్, అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.