ETV Bharat / sitara

టిక్​టాక్​ ఐశ్వర్యా రాయ్​కు హీరోయిన్​గా అవకాశం

author img

By

Published : Jun 12, 2020, 6:30 PM IST

బాలీవుడ్​ నటి ఐశ్వర్యా రాయ్​ పోలికలతో టిక్​టాక్​లో కేరళకు చెందిన అమృతా సాజు విశేషాదరణ దక్కించుకుంది. ఐశ్వర్య నటించిన చిత్రాల్లోని పాపులర్​ డైలాగ్​లతో వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అమృత.. ఓ మలయాళ చిత్రంలో హీరోయిన్​గా నటిస్తోంది.

Aishwarya Rai's viral TikToker Amrutha Saju is the lead actress of this Malayalam movie
టిక్​టాక్​ ఐశ్వర్యకు సినిమా ఛాన్స్​!

బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్​ పోలికలతో ఉన్న అమృతా సాజు టిక్​టాక్ వీడియోలు చేస్తూ​ సెన్సేషనల్​ స్టార్​గా మారింది. ఆ వీడియో యాప్​లో అమృతను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఐశ్వర్యను మైమరిపిస్తున్న ఈ అమ్మాయిది కేరళలోని తొడుప్పుజా. కొన్ని ప్రకటనల్లోనూ కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమృతను చూసి చాలా మంది హీరోయిన్​ అని భ్రమపడ్డారు. కానీ, ఆమెకు ఇటీవలే హీరోయిన్​గా ఓ మలయాళ మూవీలో ఛాన్స్​ లభించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మలయాళ చిత్రం 'పికాసో'లో అమృత హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాకు సునీల్​ కరియట్టుకర దర్శకత్వం వహిస్తుండగా.. షేక్​ అఫ్సాల్​ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్​ సోషల్​మీడియాలో వైరల్​ అయ్యింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాల్లో నటించాలనే ఆశతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమృతకు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆమె చేసిన టిక్​టాక్​ వీడియోలకూ మంచి స్పందన వస్తోంది. హీరోయిన్​ ఐశ్వర్యా రాయ్​ నటించిన చిత్రాల్లోని పాపులర్​ డైలాగ్​లతో వీడియోలను చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోందీ అమ్మడు.

ఇదీ చూడండి... మూడేళ్లకే పెళ్లి విషయంలో బన్నీకి అర్హా షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.