ETV Bharat / international

మంచి నిద్రలో పైలట్లు, 37 వేల అడుగుల ఎత్తులో విమానం చక్కర్లు

author img

By

Published : Aug 20, 2022, 8:07 AM IST

ethiopian airlines flight landing fails
Ethiopian airlines flight misses landing as pilots fall asleep mid air

విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్లు నిద్రపోయారు. అనంతరం విమానం 25 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ఇథియోపియా రాజధాని ఆడిస్‌ అబాబాలో జరిగింది.

Flight Misses Landing: ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఈఏ) విమానమొకటి 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అందులోని ఇద్దరు పైలట్లూ ఆదమరిచి నిద్రపోయారు. ఈ సంచలన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈఏకు చెందిన బోయింగ్‌ 737 విమానం ఈ నెల 15న సూడాన్‌ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్‌ అబాబాకు ప్రయాణమైంది. కొద్దిసేపటి తర్వాత పైలట్లు లోహవిహంగాన్ని ఆటోపైలట్‌ మోడ్‌లో ఉంచారు. ఆపై వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు.

ఆడిస్‌ అబాబాకు చేరుకున్నప్పటికీ ల్యాండింగ్‌కు వీలుగా విమానం ప్రయాణిస్తున్న ఎత్తు తగ్గింపు ప్రక్రియ ప్రారంభం కాకపోవడాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ గుర్తించింది. వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికి లోహవిహంగం 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. గమ్యస్థానాన్ని దాటి వెళ్లిన తర్వాత ఆటోపైలట్‌ మోడ్‌ ఆగిపోవడంతో అలారం మోగింది. దీంతో పైలట్లు ఉలిక్కిపడి లేచారు. విమానాన్ని సురక్షితంగా ఆడిస్‌ అబాబాలో దించారు. పైలట్ల నిద్ర కారణంగా 25 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొడుతూ ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి: 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనిషి, త్వరలోనే నాసా ప్రయోగం

కాయిన్స్​తో కోట్ల మోసం, స్టేట్​ బ్యాంక్​లో భారీ స్కామ్​, రంగంలోకి సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.