ETV Bharat / international

Omicron treatement: గుడ్​ న్యూస్​.. ఒమిక్రాన్​కు చికిత్స రెడీ!

author img

By

Published : Dec 3, 2021, 12:22 PM IST

ఒమిక్రాన్​కు చికిత్స, Omicron treatement
ఒమిక్రాన్​కు చికిత్స

Omicron treatment: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ వేరియంట్​కు సరికొత్త చికిత్సను రూపొందించే పనిలో పడ్డారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. బ్రిటన్​కు చెందిన వైద్య నియంత్రణ సంస్థ.. సరికొత్త యాంటీబాడీ చికిత్సకు ఆమోదం తెలిపింది. ఇది ఒమిక్రాన్​ వంటి వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుండొచ్చని భావిస్తోంది.

Omicron variant: కొవిడ్‌-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ 'ద మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ' (ఎంహెచ్‌ఆర్‌ఏ) ఆమోదించింది. ఇది ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తుండొచ్చని భావిస్తున్నారు. సోత్రోవిమాబ్‌ అనే ఈ ఔషధాన్ని సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేశారు. కరోనా వైరస్‌పైన ఉండే కొమ్ము ప్రొటీన్‌కు అంటుకుంటుంది. తద్వారా అది మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్నవారికి బాగా ఉపయోగపడుతుందని ఎంహెచ్‌ఆర్‌ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జూన్‌ రైనే తెలిపారు.

సోత్రోవిమాబ్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇస్తారు. 12 ఏళ్లు పైబడినవారికి ఇవ్వవచ్చు. ముప్పు అధికంగా ఉండే పెద్దల్లో వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ తలెత్తినప్పుడు.. వారు ఆసుపత్రిపాలు కాకుండా, మరణం బారినపడకుండా 79 శాతం మేర ఈ ఔషధం రక్షిస్తుందని క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైంది. వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే దీన్ని ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

ఇదీ చూడండి:-

ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.