ETV Bharat / entertainment

కేజీఎఫ్​ హీరోను కలిసిన టీమ్ఇండియా కెప్టెన్​ హార్దిక్​.. కారణం ఇదేనా?

author img

By

Published : Dec 29, 2022, 10:59 PM IST

కేజీఎఫ్​ హీరో యశ్​​కు సంబంధించిన ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. టీమ్​ఇండియా కెప్టెన్ హార్దిక్​ పాండ్య.. యశ్​ను​ కలిసినట్లు తెలుస్తోంది. అయితే కేజీఎఫ్-3లో హార్దిక్​ ఏమైనా రోల్​ చేస్తున్నాడా అనే చర్చ నడుస్తోంది.

kgf yash hardik pandya
kgf yash hardik pandya

కేజీఎఫ్​.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై బాక్సాఫీసును ఊపేసింది. హీరో యశ్​​కు దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించిపెట్టింది. ఇక కేజీఎఫ్ 2 అంతకుమించి హిట్​ అవ్వడం వల్ల పాన్​ ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియులకు అభిమాన హీరో అయ్యాడు యశ్​. కాగా, ఈ సినిమా మూడో పార్ట్​కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి నెట్టిల్లు కోడై కూస్తోంది. ఇటీవలే టీమ్​ఇండియా టీ20 ఫార్మాట్​కు కెప్టెన్​ పగ్గాలు అందుకున్న హార్దిక్​ పాండ్య.. యశ్​ను​ కలిసి దిగిన ఫొటోలు ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది. వీరితో పాటు హార్దిక్​ సోదరుడు.. టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ కృనాల్​ పాండ్యతో కలిసి ఫొటో దిగాడు యశ్​​. ఈ ఫొటోలను హార్టిక్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. దీంతో పాటు పోస్టు కింద 'కేజీఎఫ్ 3' అని క్యాప్షన్​ రాసుకొచ్చాడు.

kgf yash hardik pandya
యశ్​, హార్దిక్​ పాండ్య

ఇక ఈ పోస్ట్​కు లక్షల్లో లైక్​లు కొట్టడం అభిమానుల వంతైంది. కామెంట్​ సెక్షన్లో.. సినిమా, క్రికెట్​ ఫ్యాన్స్​ సందడి చేస్తూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఓ కింగ్​ మరో కింగ్​ను మీట్​ అయ్యాడని ఓ నెటిజన్​ కామెంట్​ పెడితే.. కేజీఎఫ్ 3లో హార్దిక్​ ఏమైనా రోల్​ ఉంది కావచ్చు అని మరో అభిమాని సరదాగా రాసుకొచ్చాడు. కాగా, పాన్​ ఇండియా స్టార్​ యశ్​​.. కేజీఎఫ్ 3 కాకుండా మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యష్​ 19 అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో యశ్​​కు జోడీగా పూజా హెగ్డే ఆడిపాడనుందని తెలుస్తోంది. కానీ ఈ వార్తలకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. కాగా, జనవరి 8న యశ్ తన బర్త్​డే జరుపుకోనున్నాడు. ఆ రోజు యష్ కొత్త చిత్రం గురించి అప్డేట్​ వచ్చే అవకాశం ఉంది.

kgf yash hardik pandya
కృనాల్​ పాండ్య, యశ్​, హార్దిక్​ పాండ్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.