ETV Bharat / entertainment

'మహిళల ఎదుగుదల.. పతనానికే!'.. ట్రోల్స్​కు సమంత స్ట్రాంగ్​ రిప్లై

author img

By

Published : Jan 3, 2023, 12:55 PM IST

samantha strong reply to trollers
samantha

ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న సమంత సోమవారం తిరిగి సోషల్​ మీడియాలో సందడి చేసింది. తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సామ్​.. ఓ నెటిజన్​ చేసిన ట్రోల్​కు తనదైన శైలిలో స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చింది.

అరుదైన వ్యాధి 'మైయోసైటిస్‌'తో బాధపడుతూ, కొంతకాలంగా సోషల్​ మీడియాలో సైలెంట్​గా ఉన్న టాలీవుడ్​ స్టార్​ సమంత.. సోమవారం కాసేపు ఫ్యాన్స్​తో ముచ్చటించింది. అభిమానుల ట్వీట్లకు తనదైన శైలిలో రిప్లైలు ఇచ్చింది. ఇదే క్రమంలో ఓ ట్రోలర్​కు ఆమె ఇచ్చిన జవాబు నెట్టింట చర్చనీయాంశమైంది.

తమిళనాడుకు చెందిన ఓ ఫ్యాన్ చేసిన పోస్ట్​తో ఈ చర్చ మొదలైంది. "క్రోమ్‌పేట్‌లోని వెట్రీ థియేటర్‌కు నేను, మా సోదరి వెళ్లినప్పుడు.. అక్కడున్న పోస్టర్లన్నీ ఉమెన్​ ఓరియెంటెడ్​ సినిమాలవే ఉన్నాయి. దీని బట్టి తమిళ సినిమా ఎంత దూరం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు! 10 సంవత్సరాల క్రితం అయితే ఇది అసలు ఊహించలేని విషయం." అని ఆ థియేటర్​ ఫొటోలు జత చేస్తూ రాసుకొచ్చాడు ఆ సినీ అభిమాని. ఆ ట్వీట్​ను రీట్వీట్​ చేసిన సామ్ ​"ఉమెన్ రైజింగ్!!" అని కామెంట్ చేసింది. అయితే దానికి మరో ఫాలోవర్​ "జస్ట్ టు ఫాల్" అని రిప్లై ఇచ్చాడు. ఈ కామెంట్​ను చూసిన సమంత "పడి లేచాక వచ్చే అనుభూతి మరింత మధురంగా ఉంటుంది మిత్రమా.." అని స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చింది.

సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కనున్న శాకుంతలంతో మరోసారి ఫ్యాన్స్​ ముందుకు రానుంది సమంత. స్టార్​ డైరక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు రచనతో పాటు దర్శకత్వాన్ని వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 27న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.