ETV Bharat / entertainment

జబర్దస్త్ అవినాశ్ ఎమోషనల్​ పోస్ట్​ - బాధపెట్టొద్దు అంటూ ఫ్యాన్స్​కు రిక్వెస్ట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 8:44 AM IST

Jabardasth Avinash Baby : కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ముక్కు అవినాశ్​ తాజాగా ఓ చేదు వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Jabardasth Avinash Baby
Jabardasth Avinash Baby

Jabardasth Avinash Baby : 'జబర్దస్త్' షోతో పాపులరై బిగ్​బాస్​తోనూ అలరించారు ప్రముఖ నటుడు ముక్కు అవినాశ్​. ఆయన టీవీ షోల్లోనే కాకుండా ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ షెడ్యూల్​ గడుపుతున్నారు. అయితే తాజాగా ఇన్​స్టా వేదికగా ఓ విషాదకరమైన విషయాన్ని పంచుకున్నారు. తమ బిడ్డని కోల్పోయామంటూ అభిమానులతో చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు.

2021 అవినాశ్​ - అనూజలకు వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఇన్​స్టా రీల్స్​తో పాటు యూట్యూబ్ ఛానెల్​లో వీడియోలు పెడుతూ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో తాము పేరెంట్స్​ అవ్వనున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ విషయమై పలు ఈ జంట వీడియోస్ కూడా షేర్​ చేస్తూ వచ్చారు. తాజాగా అనూజకు సీమంతం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బిడ్డ ఈ లోకాన్ని చూడలేకుండా పోయిందని అవినాశ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

" నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఓ విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతోనే ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ మీ అనూజ అవినాశ్​' అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు 'బీ స్ట్రాంగ్​ బ్రో' అంటూ అవినాశ్​ను ఓదార్చుతున్నారు.

Mukku Avinash: 'ముక్కు' అవినాష్‌ నిశ్చితార్థం- వధువు ఎవరంటే?

ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' ఫేమ్ ముక్కు అవినాష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.