హాస్యనటుడు 'ముక్కు' అవినాష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనుజతో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఆయన తెలిపారు. 'జబర్దస్త్' కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. ముఖ్యంగా వివిధ క్యారెక్టర్లను అనుకరిస్తూ నవ్వులు పంచేవారు. ప్రముఖ రియాల్టీ షో 'బిగ్‌బాస్'లోనూ సందడి చేశాడు.
![Mukku Avinash engagement photos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12935023_avina.jpg)
![Mukku Avinash engagement photos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12935023_avinash.jpg)
"సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదు. మా కుటుంబాలు, మేము కలిశాం. అనుజతో నాకు నిశ్చితార్థం అయింది. 'పెళ్లి ఎప్పుడు' అని మీరంతా నన్ను చాలా సార్లు అడిగారు. 'అతి త్వరలోనే నా అనుజతో' ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్" అని ఇన్‌స్టా వేదికగా నిశ్చితార్థం ఫొటోలను పంచుకున్నాడు.
![Mukku Avinash engagement photos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12935023_avi.jpg)
మరోవైపు అవినాష్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీముఖి, నోయల్, మెహబూబ్ సహా అవినాష్ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: హీరోయిన్‌కు వాటర్ ట్యాప్ అని పేరు పెట్టిన టాప్ డైరెక్టర్!