ETV Bharat / entertainment

హీరో నిఖిల్​ ఆవేదన, ఆయనలేకే ఈ కష్టాలంటూ

author img

By

Published : Aug 26, 2022, 1:37 PM IST

'సినీ పరిశ్రమలో నాకంటూ ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే ఇబ్బందులు పడేవాడిని కాదు' అని అన్నారు హీరో నిఖిల్‌. తన కష్టాలను చెప్పుకుని ఆవేదన చెందారు.

hero nikhil emotional
హీరో నిఖిల్​ ఆవేదన

"సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నాకంటూ ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే ఇన్ని ఇబ్బందులు పడేవాడిని కాదు" అని తన కెరీర్​ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు యువ హీరో నిఖిల్‌. 'కార్తికేయ - 2' విజయం సాధించిన నేపథ్యంలో ఓ మీడియాతో సరదాగా ముచ్చటించారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఓ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే కథే మూలమని.. అది బాగుంటే తప్పకుండా విజయం లభిస్తుందన్నారు.

"సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఓ కుటుంబం నుంచి వచ్చి నటుడిగా మారడమే నాకో పెద్ద విషయం. ఈరోజు ప్రేక్షకుల నుంచి పొందుతున్న అభిమానాన్ని చూస్తుంటే నా మొదటి సినిమా 'హ్యాపీ డేస్‌' రోజులు గుర్తుకు వస్తున్నాయి. పరిశ్రమ అంటేనే రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ప్రతి ఒక్కరూ ఇందులోకి రావాలని ఆశ పడుతుంటారు. ఏదో రకంగా ఎత్తుపల్లాలు చవి చూస్తుంటారు. 'హ్యాపీ డేస్‌' తర్వాత వెనువెంటనే 6 సినిమాలు చేశా. సినిమా, కథల విషయంలో దిశా నిర్దేశం చేయడానికి పరిశ్రమలో నాకు మార్గదర్శకులెవరూ లేరు. వరుస పరాజయాల అనంతరం సుమారు ఆరేళ్ల తర్వాత 'స్వామి రారా'తో విజయం అందుకున్నా. కథే అన్నింటికంటే ముఖ్యమని అప్పుడర్థమైంది. ఒకవేళ నాకు ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే.. కెరీర్‌ ఆరంభంలో అన్ని కష్టాలుండేవి కాదు. ఏది ఏమైనా జీవితంలో ఎత్తుపల్లాలు సాధారణమే" అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: లైగర్ లైఫ్​టైమ్​ కలెక్షన్స్​ అంచనా ఎంతంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.