ETV Bharat / entertainment

Bigg Boss 7 Telugu 6th Week Eliminations : బిగ్​బాస్​లో ఊహించని విధంగా మారిన ఓటింగ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 5:33 PM IST

Bigg Boss 7 Telugu 6th Week Eliminations
Bigg Boss 7

Bigg Boss 7 Telugu 6th Week Eliminations : బిగ్ బాస్ సీజన్ 7 ఆరో వారానికి చేరింది. ఇప్పటికే హౌజ్​ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఆరో వారం ఎలిమినేషన్​ కోసం రంగం సిద్ధమైంది. మొత్తం ఏడుగురు ఈవారం నామినేట్​ అయ్యారు. మరి, వీరిలో ఆరోవారం హౌస్​ నుంచి ఎవరు బ్యాగ్ సర్దేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 7 Telugu 6th Week Eliminations : మొదట ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ అయిన బిగ్​ బాస్ 7వ సీజన్.. అక్టోబర్ 8న జరిగిన మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 2.0గా మారాక.. మరింత ఆసక్తికరంగా మారింది. మొదట హౌజ్​లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. వారి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఐదు వారాల ఎలిమినేషన్స్​లో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు(Shubhashree) బిగ్​బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కొత్త వారు హౌజ్​లోకి అడుగుపెట్టారు.

Bigg Boss 7 Telugu 6th Week Voting Poll : ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిని ఆటగాళ్లు, పోటుగాళ్లుగా నాగార్జున విభజించారు. వీరికి కెప్టెన్సీ కోసం టాస్కులు పెడుతూ.. గేమ్​ను రసవత్తరంగా మార్చేశారు. హౌజ్​లోకి కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి.. పాతవాళ్లను బిగ్​బాస్ ఓ రేంజ్​లో ఆడుకున్నాడు. ఇక నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్​ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. వరుస టాస్కులతో ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్​బాస్ తెలుగు 7 సీజన్(Bigg Boss Telugu 7) ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. అందులో ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. వారిలో ప్రిన్స్ యావర్, అమర్​దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నారు. అయితే.. వీరితోపాటు మొదట సందీప్ కూడా నామినేట్ అయ్యాడు. కానీ, సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్​ తనకు ఇచ్చిన పవర్ ద్వారా ఇతన్ని సేవ్ చేశాడు.

Bigg Boss Telugu 7 Wild Card Entries : బిగ్​బాస్​ వైల్డ్​ కార్డ్​.. ఎవరెవర్నో తెచ్చారు.. క్రేజ్ పెరిగేనా?

టాప్​ & లాస్ట్​లో కొనసాగుతున్న వారు వీరే : ఇక బిగ్ బాస్ 7 తెలుగు 6వ వారం నామినేట్ అయిన ఏడుగురు కంటెస్టెంట్లలో ప్రిన్స్ యావర్ అత్యధిక ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో అమర్ దీప్, మూడో స్థానంలో టేస్టీ తేజ, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ కొనసాగుతున్నారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఐదో స్థానానికి చేరుకుంది. ఇక చివరి రెండు స్థానాల్లో అతి తక్కువ ఓటింగ్​తో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నారు. అంతే కాదు వీరిద్దరూ డేంజర్​ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా లేడీ కంటెస్టెంటే.. పూజామూర్తి, శోభా శెట్టికు మధ్య పెద్దగా ఓట్ల తేడా లేదు. అంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఆరో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే.. ఓటింగ్​లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగితే.. వైల్డ్​ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన పూజామూర్తి కంటే ముందుగా వచ్చిన శోభా శెట్టినే ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. ఇదే జరిగితే బిగ్​బాస్ సీజన్ తెలుగు 7లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయినట్లే.

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

MLA In Bigg Boss : బిగ్​బాస్​లోకి ఎమ్మెల్యే గ్రాండ్​ ఎంట్రీ.. ఎన్ని రోజులు ఉంటాడో? నెట్టింట తీవ్ర చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.