ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో 'హాయ్​ నాన్న'ను బీట్​ చేయలేకపోతున్న 'యానిమల్​' - కారణం ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 1:35 PM IST

Animal Movie US Collections : డిసెంబర్ 1న విడుదలైన 'యానిమల్'​ మూవీ ఎటువంటి సెస్సేషన్స్​ క్రియేట్​ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా సాధించి బాక్సాఫీస్​ వద్ద తన సత్తా చాటుతోంది. అయితే యూఎస్​లో మాత్రం డీలా పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Animal Movie US Collection
Animal Movie US Collection

Animal Movie US Collections : రణ్​బీర్​ కపూర్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన యానిమల్​ మూవీ ఎంతటి సక్సెస్​ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్​లో డిసెంబర్​ 1న విడుదలైన ఈ సిినిమా 12 రోజుల్లో సూమారు 757 కోట్లు సాధించి బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద యానిమల్ దుమ్ములేపేస్తోంది. తెలుగులో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిపోయిన మూవీ హిందీ వెర్షన్​లోనూ ఓ రేంజ్​లో వసూళ్లు అందుకుని ఆకట్టుకుంది.

అయితే ఓవర్సీస్​లో మాత్రం ఈ సినిమా తెలుగు వెర్షన్​ కాస్త డీలా పడ్డట్లు తెలుస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి థియేటర్లలో 'యానిమల్'​ సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతునప్పటికీ తెలుగు వెర్షన్​లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లను కూడా దాటలేదట. అయితే ఇటీవలే విడుదలైన 'హాయ్​ నాన్న' సినిమా అక్కడ ఓ రేంజ్​లో దూసుకెళ్తోందని సమచారం. ట్రేడ్​ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్​లో 1.3 మిలియన్ డాలర్లు మార్క్​ అందుకుందట. ఈ క్రమంలో వారం ముందే విడుదలైన యానిమల్​ను బీట్ చేసింది. అయితే యానిమల్ హిందీ వెర్షన్​ చూసేందుకు యూఎస్ అభిమానులు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఒక్క కెనడాలోనే ఆరు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించిందట.

Animal Movie Cast : ఈ సినిమా విషయానికి వస్తే, తండ్రీకొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన 'యానిమల్​'లో ఈ సినిమాలో హీరో రణ్​బీర్​కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. సందీప్​రెడ్డి ఈ సినిమాను లెవెల్​కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. ఈయన పాటు బాబీ దేఓల్​, తృప్తి డిమ్రి లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ సీన్స్​తో పాటు పాటలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ​'యానిమల్' తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉంది. అయినప్పటికీ ఈ చిత్రం సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2025లో 'యానిమల్​ పార్క్' - ఆ ఫీడ్​బ్యాక్​ కోసం డైరెక్టర్​ వెయిటింగ్​!

రష్మికను వెనక్కి నెట్టిన 'యానిమల్​' భామ- తృప్తి డిమ్రి కొత్త 'నేషనల్​ క్రష్' అంటగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.