ETV Bharat / entertainment

ప్రభాస్​కు అనారోగ్యం.. షూటింగ్స్ క్యాన్సిల్​​.. ఆందోళనలో ఫ్యాన్స్​!

author img

By

Published : Feb 7, 2023, 1:13 PM IST

పాన్​ ఇండియా స్టార్​​ ప్రభాస్​​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సలార్​తో పాటు పలు ప్రాజెక్టులకు సైన్​ చేసిన ఈ స్టార్​ హీరో ఆయా షూటింగ్స్​ను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే దీని వల్ల ఆయన అనారోగ్యం పాలయ్యారట. ఆ వివరాలు..

prabhas
prabhas

టాలీవుడ్​ స్టార్​ డార్లింగ్​ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్​లతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్​ కె మూవీ చిత్రీకరణల్లో నిమగ్నమైన ఈ పాన్​ ఇండియా స్టార్​ ప్రస్తుతం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ బిజీ షెడ్యూల కారణంగా ప్రభాస్‌ అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. ఆయనకు జ్వరం వచ్చిందని సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న తన సినిమాల షూటింగులన్నింటికి కాస్త బ్రేక్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ప్రభాస్.. త్వరలోనే ఆదిపురుష్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు సలార్ చిత్రీకరణ కూడా దాదాపు ముగిసిందట. ఇక నాగ్​ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతీతో చేయబోయే సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇకపోతే త్వరలోనే ఆయన పఠాన్​తో సూపర్​ సక్సెస్​ను అందుకున్న సిద్ధార్థ్​ ఆనంద్​తో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్​ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. వీటన్నిటితో పాటు ఆయన సందీప్ రెడ్డి వంగాతోనూ స్పిరిట్ అనే సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.