ETV Bharat / entertainment

ఎన్టీఆర్​, ఏఎన్నార్‌తో విభేదాలు.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట!

author img

By

Published : Jan 27, 2023, 10:50 AM IST

Updated : Jan 27, 2023, 11:42 AM IST

జమున పేరు చెప్పగానే తెలుగువారికి గుర్తుకు వచ్చే చిత్రాల్లో 'గుండమ్మ కథ' ఒకటి. ఆ సినిమాకు 60 ఏళ్లు పూర్తైన సందర్భంలో గతంలో ఆ చిత్రం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇచ్చారు జమున. ఇందులో ఆమె ఎన్టీఆర్​, ఏఎన్నార్‌తో గొడవ, అసలీ సినిమాలోకి ఆమె ఎలా వచ్చారు సహా పలు విషయాలను తెలిపారు. నేడు ఆమె కన్నుమూసిన సందర్భంగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.

Actress Jamunో ్గా్
నటి జమున ఇకలేరు

తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి సంసారపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్‌ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించింది ఆమె. ఆమెలా మరే ఇతర నటీమణులూ పోషించనలేరు అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి.. నిప్పాణి 'జమున'. అయితే ఆమె ఇకలేరు. వయోభారంతో అనారోగ్య సమస్యలోనే కన్నుమూశారు. అయితే అసలు ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమాల్లో 'గుండమ్మ కథ' ఒకటి. అంతలా ఆమెకు పేరు సంపాదించి పెట్టిందీ సినిమా. ఈ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకొస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై అరవై ఏళ్లు అయిన సందర్భంగా గతంలో జమున ఈటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడా విషయాలు మీ కోసం...

'గుండమ్మ కథ' టైటిల్‌ చూడగానే అప్పట్లో స్పందన ఎలా ఉంది..?
జమున: 'గుండమ్మ కథ' సినిమా పేరు పెట్టినపుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో అప్పటికే మాకున్న వివాదాన్ని గుండమ్మ ఆ సినిమాతో కాంప్రమైజ్‌ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే మునిగిపోతారు. నేను కాబట్టి వగరు, పొగరుతో మూడేళ్లు వాళ్లతో సినిమాలు చేయనని భీష్మించుకున్నాను. మీతో కాదు.. దారిన పోయే దానయ్యతోనైనా సినిమా చేస్తానని అన్నాను. ఈ క్రమంలో జగ్గయ్య లాంటి వాళ్లతో చేసి సూపర్‌హిట్‌ ఇచ్చా. పాత రోజుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కాంచనమాల, కన్నాంబ... తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరం 20, 30 ఏళ్లు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌తో సంబంధాలు సరిగా లేనపుడు 'గుండమ్మ కథ'లోకి ఎలా వచ్చారు? సరోజగా మీరే చేయాలని ఎందుకు కోరారు?
జమున: ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నాగేశ్వరరావుతో ఇబ్బందిపడి ఆయనతో సినిమాలు చేయలేదు. నా జోలికి రావొద్దని చెప్పా. ఏ రంగంలోనైనా స్త్రీ ఆత్మాభిమానం పొగొట్టుకోవద్దంటే సమస్యల్ని ఎదుర్కొవాలి. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ఏదో చిన్న పిల్ల కాలు మీద కాలు వేసుకుందని అలా ఉంటే ఎలా.. నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండని నాగేశ్వరరావుతో చెప్పారు. నిజంగా చెప్పాలంటే అది నా టాలెంట్‌కు సరిపడా పాత్రేం కాదు. మామూలు చిలిపి అమ్మాయిగా చేయాలంతే.

మీ నలుగురినే 'గుండమ్మకథ'లో పెట్టుకోవాలని అనుకోవడంలో 'మిస్సమ్మ' సినిమా పాత్ర ఏమైనా ఉందా?
జమున: ఏ పాత్ర సృష్టించినా దాని స్వభావం, తీరుతెన్నులను రచయిత గమనిస్తారు. ఆ పాత్ర ఎవరూ చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తారు. సావిత్రి పొగరుగా నటిస్తే ఒప్పుకుంటారా.. ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు వేశాలేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. అలాంటి నటన జన్మతహ ఉండాలి. అప్పుడే పాత్రలో ఒదిగిపోతాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టీనేజ్‌లో కూడా అమ్మా కాఫీ అనేవారా?
జమున: అదేం లేదు. రాణిలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మా, నాన్న, తమ్ముడు, మరదలు ఇంట్లో ఉండేవారు. అంతా అమ్మా చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. నా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవారు.
సూర్యకాంతంతో మీ అనుబంధం ఎలా ఉండేది..?
జమున: సూర్యకాంతం నాకు చాలా క్లోజ్‌. మంచి తల్లి అందరినీ బిడ్డల్లా చూసేది. అందరికి పెట్టేందుకు పెద్ద క్యారియర్‌ తెప్పించేది. దగ్గరుండి తినిపించేది.

ఇదీ చూడండి: వెండితెర సత్యభామ

Last Updated :Jan 27, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.