ETV Bharat / crime

శ్రుతిమించిన రుణయాప్​ల ఆగడాలు.. మహిళ ఫోన్​ నంబర్​ను 500 మందికిచ్చి వేధింపులు

author img

By

Published : Mar 10, 2022, 4:47 AM IST

Loan Apps Case: తెలుగురాష్ట్రాల్లో రుణ యాప్‌ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. పోలీసులు వీరి ఆటకట్టిస్తున్నా బాధితుల నుంచి నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తాజాగా రుణం తీసుకున్న ఓ మహిళ ఫోన్ నంబర్‌ను 500 మందికి పైగా ఇచ్చి ఆమెను వేధింపులకు గురిచేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు తీగ లాగితే డొంకంతా కదిలింది.

శ్రుతిమించిన రుణయాప్​ల ఆగడాలు.. మహిళ ఫోన్​ నంబర్​ను 500 మందికిచ్చి వేధింపులు
శ్రుతిమించిన రుణయాప్​ల ఆగడాలు.. మహిళ ఫోన్​ నంబర్​ను 500 మందికిచ్చి వేధింపులు

Loan Apps Case: హైదరాబాద్ రేతిబౌలికి చెందిన ఓ మహిళ తన అవసరాల కోసం అధిక వడ్డీకి పలు రుణయాప్‌ల నుంచి సుమారు 2లక్షలు రుణం తీసుకుంది. చెల్లింపులో ఆలస్యం కావడంతో కాల్ సెంటర్ల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు సహచర ఉద్యోగులకు ఫోన్లు చేసి ఆమెను కించపరిచారు. ఆమె ఫోన్ నంబరును 500 మందికి యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్లు రావడంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షన్నర తీసుకున్న మరో బాధితుడిని ఏకంగా అతను చనిపోయినట్లుగా శవానికి ఫోటోను మార్ఫింగ్ చేసి పంపించారు. ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బెంగళూరు కేంద్రంగా ఓ కాల్ సెంటర్ పై దృష్టి సారించి.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్​

ఒడిశాకు చెందిన షబ్బీర్ అలాం, ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఉమాకాంత్ యాదవ్‌లు చెన్ చౌపింగ్ ఆదేశాలతో బెంగళూరులోని కోరమాండల ప్రాంతంలో వంద మంది ఉద్యోగులతో కాల్ సెంటర్ తెరిచారు. ఓషన్ రూపీ, లైఫ్ వ్యాలెట్, మాలో వ్యాలెట్, ఎలిఫెంట్ క్యాష్, బాక్స్ క్యాష్, దత్త రూపీ యాప్ కాల్ సెంటర్ ద్వారా కస్టమర్లకు ఫోన్లు చేసి ఎలా డబ్బు రాబట్టాలో వారికి శిక్షణ ఇచ్చారు. వరుస ఫిర్యాదులతో దర్యాప్తు చేసిన పోలీసులు కాల్ సెంటర్‌పై సైబర్ క్రైం పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. నిందితుల నుంచి 63ల్యాప్​టాప్‌లు, 19చరవాణులు, 2 డెబిట్ కార్డులు సీజ్ చేశారు. వీరిపై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.

రుణం వస్తుందని మోసపోవద్దు..

రుణ యాప్‌ల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు 23మందిని అరెస్ట్ చేశారు. 200కోట్ల నగదు సీజ్ చేశారు. సులభంగా రుణం వస్తుందని మోసపోవద్దని.. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.