ETV Bharat / crime

ఉపాధ్యాయురాలి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

author img

By

Published : Feb 14, 2022, 3:06 PM IST

murder case in kadiri
కదిరిలో ఉపాధ్యాయురాలి హత్య కేసు

murder case in kadiri: గతేడాది ఏపీలోని కదిరిలో జరిగిన ఉపాధ్యాయురాలి హత్యకేసు కొలిక్కి వచ్చింది. బెంగళూరుకు చెందిన లారీ డ్రైవర్​ను ఈ కేసులో కీలక నిందితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు.

kadiri murder case: ఆంధ్రప్రదేశ్​లోని కదిరిలో ఉపాధ్యాయురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలను అపహరించిన కేసు వ్యవహారం నాలుగు నెలల తర్వాత కొలిక్కి వచ్చింది. బెంగళూరుకి చెందిన లారీ డ్రైవర్​ను ఈ కేసులో కీలక నిందితుడిగా భావించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది

గతేడాది నవంబర్ 16న అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఎన్జీవోకాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ టీచర్ ఉషారాణి తలపై రాడ్ తో మోది హత్య చేశారు. సుమారు 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అలాగే పక్కింట్లోనే ఉన్న శివమ్మ అనే మహిళ పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

పోలీసులకు సవాలుగా

శాంతిభద్రతలకు సవాల్​గా నిలిచిన ఈ ఘటనను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదనపు ఎస్పీకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. 50 మంది అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసు శాఖ.. వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. అయితే, కర్ణాటకలో జరిగిన చోరీ కేసులో నిందితుడిగా ఉన్న లారీ డ్రైవర్​ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు కదిరిలో హత్య, దోపిడీ చేసినట్లు అంగీకరించినట్లు ఏపీ పోలీసులు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములైన పోలీసు అధికారులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదించి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: Vanasthalipuram Theft Case : సైకిల్​పై పగలు రెక్కీ.. తాళం వేసి ఉన్న ఇళ్లలో రాత్రిపూట చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.