ETV Bharat / crime

Fake seeds: 120 కిలోల బీటీ3 నకిలీ పత్తి విత్తనాలు సీజ్​

author img

By

Published : Jun 5, 2021, 10:41 PM IST

fake seeds
fake seeds

కుమురం భీం జిల్లాలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సోదాల్లో 120 కిలోల బీటీ3 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.వాటి విలువ సుమారు 2 లక్షల 40వేల విలువ ఉన్నట్లు తెలిపారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బురుగుడా గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. మెకార్తి శ్రీనివాస్​ ఇంట్లో నిలువ ఉన్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 120 కిలోల బీటీ3 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2 లక్షల 40వేల విలువ ఉన్నట్లు తెలిపారు. వాటిని పోలీస్​స్టేషన్​కు తరలించి.. నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందులు అక్రమంగా నిలువ ఉంచి.. విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.