ETV Bharat / crime

చైన్​ దొంగిలించాడనే అనుమానంతో పోలీసుల థర్డ్​ డిగ్రీ..! స్పందించిన డీఎస్పీ

author img

By

Published : Feb 9, 2023, 7:02 PM IST

Updated : Feb 9, 2023, 9:09 PM IST

chain snatching
చైన్​ స్నాచింగ్​

Chain snatching in Medak: చైన్​ దొంగతనం చేశాడన్న అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్​ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను నడవలేని స్థితికి చేరుకుని.. ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయంపై అతని భార్య తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

Chain snatching in Medak: మహిళ మెడలో నుంచి బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఐదు రోజుల తరువాత అతడిని వదిలి పెట్టగా.. ఒళ్లు హూనం అయిన బాధితుడు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గురువారం బాధితుడు ఖాదిర్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం అరబ్ గల్లిలో గత నెల 29న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సీసీ పుటేజ్​ ఆధారంగా హైదరాబాద్​లో పని చేసే స్థానిక పిట్లంబేస్​ వీధికి చెందిన మహహ్మద్​ ఖదీర్​ను అనుమానితునిగా గుర్తించారు. వెంటనే పోలీసులు హైదరాబాద్​ వెళ్లి ఈ వ్యక్తిని పట్టుకుని వచ్చి.. ఎంక్వైరీ పేరుతో ఇష్టారీతిలో చిత్రహింసలు పెట్టి.. కొట్టారని బాధితుడు ఆరోపించాడు. ఈ నెల 2న పోలీసులు అతడిని వదిలిపెట్టగా ఇంటికి వెళ్లిన అతను 6న కలెక్టరేట్​ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత బాధితుడిని కుటుంబసభ్యులు మెదక్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కిడ్నీలు దెబ్బతినడంతో బాధితుడిని హైదరాబాద్​ తరలించారు.

పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని, చేతులు పని చేయడం లేదని బాధితుడి భార్య ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకున్నా హైదరాబాద్​లో కూలీ పని చేసుకునే తన భర్త​ను పోలీసులు కారణం లేకుండా పట్టుకొచ్చి చితకబాదారని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం తన భర్త పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

డీఎస్పీ సైదులు వివరణ: ఖాదిర్‌ఖాన్‌పై థర్డ్‌ డిగ్రీ ఆరోపణలపై మెదక్​ డీఎస్పీ సైదులు వివరణ ఇచ్చారు. ఖాదిర్ ఖాన్‌పై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని వివరించారు. గొలుసు చోరీ ఘటనలో నిందితుడి పోలికలు ఖాదిర్‌ఖాన్‌ మాదిరిగా ఉన్నాయని అనుమానంతో.. అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. ఈ చోరీ తాను చేయలేదని ఖాదిర్‌ఖాన్‌ తెలపడంతో 3న వదిలేశారని తెలిపారు. తహసీల్దార్​ ముందు బైండోవర్​ చేసి ఖాదిర్​ఖాన్​ను వదిలేశామని పేర్కొన్నారు. వైద్యుల నివేదిక వచ్చాక బాధితుడి అనారోగ్యానికి కారణాలు తెలుస్తాయని వివరించారు. ఆ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత.. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సైదులు వెల్లడించారు.

చైన్​ దొంగలించాడనే అనుమానంతో థర్డ్​ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated :Feb 9, 2023, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.