ETV Bharat / city

రైతులకు కేసీఆర్ అండగా నిలవడంతోనే... సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి

author img

By

Published : Nov 19, 2021, 7:35 PM IST

(Centre to Repeal Of 3 Farm Laws) మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడంపై తెరాస ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అండగా కేసీఆర్ (CM KCR) నిలవడంతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి సాగు చట్టాలను రద్దు చేసిందని (Centre to Repeal Of 3 Farm Laws) పేర్కొన్నారు. కేసీఆర్ మహాధర్నా (TRS Maha Dharna) చేయడంతో దేశంలో కదలిక వచ్చిందని చెప్పారు.

trs mps
trs mps

రైతులకు అండగా కేసీఆర్ (CM KCR) నిలవడంతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నదని (Centre to Repeal Of 3 Farm Laws) తెరాస ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చట్టాలను వెనక్కి తీసుకోవడంపై తెరాస ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పి.రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకొని ఉంటే.. రైతులు చనిపోయే వారు కాదన్నారు.

మహాధర్నాతో దేశంలో కదలిక

ఉద్యమంలో మరణించిన రైతులను ఆదుకోవాలని ఎంపీలు అన్నారు. కేసీఆర్ మహాధర్నా (TRS Maha Dharna) చేయడంతో దేశంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ బాటలోనే నడవాలని ఇతర రాష్ట్రాల సీఎంలు నిర్ణయించుకున్నారని ఎంపీలు చెప్పారు. కేంద్రం విద్యుత్ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. భాజపా నాయకులు రాష్ట్రంలో ఒక మాట.. కేంద్రంలో మరో మాట మాట్లాడుతున్నారని... కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసేలా చట్టం తీసుకు రావాలని అన్నారు. బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి వడ్లను కొంటామని ఉత్తర్వులు తీసుకురావాలని సూచించారు.

ఎన్నో పోరాటాలు చేశాం

రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు సాగు వ్యతిరేక చట్టాలను రద్దు (Centre to Repeal Of 3 Farm Laws) చేసిందని తెరాస లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు (TRS MP Nama Nageswara Rao) పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై నామ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని తాము పార్లమెంట్​ లోపల, బయట గొంతెత్తి అరిచినా అప్పుడు కేంద్రం వినిపించుకోలేదని గుర్తు చేశారు. ఈ చట్టాలు లోకసభ, రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు తాము ఎన్నో పోరాటాలు చేసినట్టు నామ (TRS MP Nama Nageswara Rao) వెల్లడించారు.

మంచివే కానీ..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను (Farm laws 2020) రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని (Farm laws repeal) పేర్కొన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. గురునానక్​ జయంతి (Guru nanak jayanti) సందర్భంగా జాతిని ఉద్దేశించి (PM Narendra Modi addresses the nation) ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ కీలక ప్రకటన చేశారు.

ఇదీ చదవండి : కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.