ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM

author img

By

Published : Jun 21, 2022, 8:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • నేటి నుంచి తరగతులకు హాజరవుతాం

వారం రోజుల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చేపట్టిన నిరసనకు తెరపడింది. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ విద్యార్థులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇవాళ్టి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

  • ఏడేళ్ల గోస.. ఏదీ ధ్యాస

బాసరలోని ఆర్జీయూకేటీ దేశంలో ఏడేళ్లకు పైగా శాశ్వత వీసీ లేని ఏకైక విశ్వవిద్యాలయంగా విమర్శల పాలవుతోంది. శాశ్వత ఉపకులపతిని నియమించాలన్నది విద్యార్థుల 12 డిమాండ్లలో ఒకటి. రాష్ట్రంలో 15 వర్సిటీలకు న్యాక్‌ గ్రేడ్‌లుండగా.. ‘సి’ గ్రేడ్‌ పొందిన వర్సిటీ ఇదొక్కటే. శాశ్వత వీసీ లేక ఆర్జీయూకేటీ సమస్యల నిలయంగా మారింది.

  • దారిలేని బడికి రాలేం

ఆ ఊరి విద్యార్థులు పక్క ఊళ్లో ఉన్న సర్కార్ బడికి వెళ్లాలంటే ముప్పుతిప్పలు పడాల్సిందే. పొలాల మధ్య నుంచి.. రాళ్లురప్పల పై నుంచి నానాఅవస్థలు పడుతూ వెళ్లాల్సిందే. ఏళ్ల తరబడి ఇదే సమస్య. కొన్నేళ్ల కిందట రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ రోడ్డు పొలాల మధ్య నుంచి వెళ్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. అంతే ఇక అక్కడే పనులకు బ్రేక్ పడింది. రోడ్డులేక అవస్థలు పడుతూ బడికి వెళ్లలేక విద్యార్థులంతా వారి తల్లిదండ్రులతో వెళ్లి తాము రోడ్డు వేసే వరకు బడికి రామని.. టీసీలు ఇవ్వమని పాఠశాల ముందు బైఠాయించారు.

  • పరస్పర బదిలీకి పచ్చజెండా

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో 2,558 మంది ఉపాధ్యాయులు కాగా మరో 1,500 మంది ఇతర శాఖల ఉద్యోగులున్నారు. పరస్పర బదిలీలపై హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా అంగీకారపత్రం ఇచ్చిన వారిని వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది.

  • 17 వేల అడుగుల ఎత్తులో హిమవీరుల యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్​ను పురస్కరించుకుని భారత జవాన్లు యోగా నిర్వహించారు. ఐటీబీపీ సైనికులు లద్దాఖ్​లో 17 వేల అడుగుల ఎత్తులో, హిమాచల్​ ప్రదేశ్​లో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు.

  • రాణి పారుకుట్టి.. ఎత్తుగడలతో ఆంగ్లేయుల ఆటకట్టి..

స్వాతంత్య్రానికి ముందున్న వందల సంస్థానాల్లో దాదాపు అన్నీ ఆంగ్లేయులకు అణిగిమణిగి ఉన్నవే. భయపడో, వారిచ్చే బిరుదులకు ఆశపడో తెల్లవారికి తలవంచినవే! కానీ ఒక సంస్థానం మాత్రం తమ రాణి ఎత్తుగడలతో బ్రిటిష్‌వారికి కంట్లో నలుసులా మారింది. అదే కొచ్చిన్‌. ఆ రాణి పారుకుట్టి నెత్యార్‌ అమ్మ! తన ఎత్తుగడలతో ఆంగ్లేయుల్ని నిస్సహాయుల్ని చేశారు రాణి పారుకుట్టి!

  • '16 ఏళ్లు నిండిన ముస్లిం బాలికలు పెళ్లికి అర్హులే'

ముస్లిం బాలికల వివాహంపై పంజాబ్​-హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 16 ఏళ్లు నిండిన వారు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారు వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు అర్హులే అని పేర్కొంది.

  • మధ్యంతర దశలో క్షిపణి కూల్చివేత

మధ్యంతర దశలో (మిడ్‌కోర్స్‌) అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్‌ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది.

  • సీనియర్లు హిట్​.. జూనియర్లు ఫట్​​!

అవకాశాలు ఊరికే రావు.. వస్తే పాతుకుపోవాలి! క్రికెట్లో భారత్‌ లాంటి అత్యంత పోటీ ఉండే జట్లకు పక్కాగా వర్తించే సూత్రమిది. మరి అలాంటి అవకాశాలు దొరక్క దొరక్క దొరికితే రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి.. కానీ కొంతమంది కుర్రాళ్లు దీనికి భిన్నంగా ఛాన్స్‌లు వృథా చేసుకుంటుంటే.. అవకాశం వచ్చిందే తడవుగా రాణించి సత్తా చాటుతున్నారు కొందరు సీనియర్​ ప్లేయర్లు.

  • 'లెక్కలు వేసుకోను.. అవసరమైతే ఆ పనైనా చేస్తా'

"నాకు మనసుకు నచ్చిన కథల్నే తెరకెక్కిస్తుంటా" అంటున్నారు దర్శకుడు జీవన్‌రెడ్డి. 'జార్జ్‌ రెడ్డి' తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం 'చోర్‌ బజార్‌'. ఆకాష్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించారు. ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించి సినిమా సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.