ETV Bharat / city

దళితబంధు లబ్ధిదారులకు ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌ శిక్షణ కార్యక్రమం

author img

By

Published : Sep 25, 2022, 12:37 PM IST

NAC Executive Committee meeting: దళితబంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన న్యాక్ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కమిటీ ఆమోదించింది. 2022-23 సంవత్సరంలో 30,600 మంది శిక్షణకు కార్యచరణ రచించారు.

Minister Prashanth Reddy
Minister Prashanth Reddy

NAC Executive Committee meeting: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన న్యాక్‌ క్యాంపస్‌లో న్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. దళితబంధు లబ్ధిదారులకు ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా సాంకేతికంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. 2022-23 సంవత్సరంలో 30,625 మందికి శిక్షణకు కార్యాచరణ రచించారు.

పలు ఇంజనీరింగ్‌ విభాగాల్లో 20 శాతం మంది వర్కింగ్ ఇంజినీర్లకు స్వల్ప కాలిక శిక్షణలు.. అదే విధంగా 2022-23 సంవత్సరంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజినీర్లు, టెక్నికల్ పర్సనల్ కీ.. 30 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని తీర్మానించారు. జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు తీసుకునేందుకు.. నైపుణ్యాభివృద్ధి న్యాక్ శిక్షణ కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున దశల వారిగా నిర్మించాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఉపాధి కోసం మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నారు. ఈ కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర శిక్షణా కేంద్రాలుగా మారనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలను ఆమోదించారు. 11 జిల్లా శిక్షణా కేంద్రాలకు అధునాతన శిక్షణ పరికరాల సేకరణకు రూ.1.32 కోట్లు మంజూరు చేసింది. సంస్థ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద తాన్లా ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్‌తో కలిసి 100 మంది నిరుద్యోగ యువతకు ఫైలట్ ప్రాతిపదికన నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టేందుకు సమావేశం అనుమతింది. న్యాక్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతాన్ని రెండు స్పెల్స్‌లో పెంచేందుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్అండ్‌బీ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు, తదిరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.