ETV Bharat / city

Salary Hike: మున్సిపాలిటీ పాలకవర్గం వేతనాల పెంపు.. ఎవరెవరికి ఎంత పెరిగిందంటే..?

author img

By

Published : Nov 19, 2021, 4:51 AM IST

మున్సిపాలిటీ పాలకవర్గం వేతనాలు(municipal council members salary) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్​ల గౌరవ వేతనాలతో పాటు.. వైస్​ఛైర్మన్​లు, వార్డు సభ్యుల గౌరవ వేతనాలు సైతం పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

municipal council members salaries hike in telangana
municipal council members salaries hike in telangana

రాష్ట్ర వ్యాప్తంగా నగర, పురపాలిక పాలకవర్గ(municipalities and corporations) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపాలిటీ పాలకవర్గం వేతనాలు(municipal council members salary) పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ(telangana municipal corporation) ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్​ల గౌరవ వేతనాలు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైస్​ఛైర్మన్​లు, వార్డు సభ్యుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎవరెవరికి ఎంతంటే..

కార్పొరేషన్​లో మేయర్‌ వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచినట్లు మున్సిపల్ శాఖ వెల్లడించింది. డిప్యూటీ మేయర్ల వేతనం రూ.25000 నుంచి రూ.32,500కు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సిలర్ల(municipal councillor salary)కు రూ.6 వేల నుంచి రూ.7,800ల వరకు వేతనాలు పెంచారు. 50 వేల జనాభా కంటే ఎక్కువ మంది నివసించే మున్సిపాలిటీలలో ఛైర్ పర్సన్​కు రూ.15,000ల నుంచి రూ.19,500ల వరకు, వైస్ ఛైర్​పర్సన్​కు రూ.7,500ల నుంచి రూ.9,750 వరకు, వార్డ్ మెంబర్లకు రూ.3,500ల నుంచి రూ.4,550 వరకు పెంచారు.

50వేల కంటే తక్కువ జనాభా నివసించే మున్సిపాలిటీలలోని ఛైర్ పర్సన్​లకు రూ.12,000ల నుంచి రూ.15,600ల వరకు, వైస్ ఛైర్​పర్సన్​లకు రూ.5 వేల నుంచి రూ.6,500ల వరకు, వార్డ్ మెంబర్​లకు రూ.2,500ల నుంచి రూ.3,250 పెంచుతూ మున్సిపల్ శాఖ నిర్ణయించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.