ETV Bharat / city

ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

author img

By

Published : Jun 22, 2022, 2:00 PM IST

AP Inter Results 2022
AP Inter Results 2022

AP Inter Results 2022 : ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

AP Inter Results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. ఉమ్మడి కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు.

  • ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత (54 శాతం)
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2,58,449 మంది ఉత్తీర్ణత (61 శాతం)
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో బాలురు 49, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో బాలురు 59, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత
  • అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత
  • అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది ఉత్తీర్ణత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.