ETV Bharat / city

టాప్ టెన్ న్యూస్ @7PM

author img

By

Published : Nov 4, 2020, 7:00 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్ టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. ఆద్యంతం ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్​ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్​ స్టేట్స్​పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మూడు నెలలు అత్యంత కీలకం

కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు జి.శ్రీనివాస రావు అన్నారు. ప్రభుత్వ చర్యలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో 44 లక్షలకుపైగా పరీక్షలు జరిగితే.. మరణాల రేటు 0.55 శాతమే ఉందన్నారు. పండుగల సీజన్​తో పాటు చలికాలం కావడం వల్ల వైరస్ మళ్లీ విజృంభించకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రభుత్వంపై పోరు

సన్నరకం ధాన్యాన్ని రెండున్నర వేల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం నల్గొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఏపీలో కేసులెన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 75 వేల 465 నమూనాల ఫలితాలు రాగా 2వేల 477 మంది కరోనా బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 33 వేల 208కి చేరినట్లు తెలిపింది. వైరస్‌తో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 6 వేల 744కు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. పినాక విజయవంతం

అత్యాధునిక పినాక రాకెట్లను విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ. ఒడిశా చందిపుర్​లోని టెస్ట్​ రేంజ్​ నుంచి 6 రాకెట్లు ప్రయోగించగా.. అన్ని లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సినిమా హాళ్లు ఓపెన్

మహారాష్ట్ర లాక్​డౌన్ నిబంధనలు సడలించింది. నవంబరు 5 నుంచి సినిమా థియేటర్లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలు తెరవడం సహా మరికొన్నింటికి అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. నేపాల్​ భూభాగం ఆక్రమణ

నేపాల్​ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలను ధ్రువీకరించారు ఆ దేశ సరిహద్దు ప్రజలు. ఎన్నో ఏళ్లుగా ప్రజల చేతిలో ఉన్న భూమి.. ప్రస్తుతం చైన అధీనంలో ఉందని, దాంతో ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పసిడి ప్రియం

పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం రూ.110కి పైగా పెరిగింది. వెండి మాత్రం భారీగా తగ్గి.. రూ.61 వేల మార్క్ దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. వికెట్లు తీయడం కష్టమే!

యూఏఈలో వాతావరణ మార్పుల వల్ల బౌలర్లు వేసుకునే ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నాడు పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా. చెమట, మంచు కారణంగా బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పూనమ్​ పాండేపై కేసు

బహిరంగ ప్రదేశంలో అశ్లీల వీడియోలో నటించిందనే ఆరోపణలతో నటి పూనమ్​ పాండేపై గోవాలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.