ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM

author img

By

Published : Nov 2, 2020, 12:58 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. ధరణి సేవలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్​ తహసీల్దార్​ కార్యాలయంలో సీఎస్​ సోమేష్ కుమార్​ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​... ధరణి సేవల ప్రక్రియ గురించి సీఎస్​కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ 946 మంది నగదు చెల్లించగా... 888 మంది స్లాట్ బుక్​ చేసుకున్నట్టు సీఎస్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. రాంచందర్‌రావు గృహ నిర్బంధం

భాజపా నేత రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తాము ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వలేదని, భాజపాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గృహ నిర్బంధం చేసి తమ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ట్రైనీ కలెక్టర్​గా సంతోషిని

యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా కల్నల్​ సంతోశ్​ బాబు సతీమణి సంతోషినిని రాష్ట్ర ప్రభుత్వం అటాచ్​ చేసింది. కలెక్టర్​ అనితా రామచంద్రన్​కు ఇవాళ ఆమె రిపోర్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. నలుగురు నక్సల్స్ అరెస్టు

ఝార్ఖండ్​లోని సిమడెగా జిల్లాలో నలుగురు నక్సల్స్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. మరో ఉద్దీపన ప్యాకేజీ

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం విస్తృత చర్చలు జరుపుతోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఏఏ రంగానికి ఎలాంటి సాయం అవసరమో అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. చైనాలో హైఅలర్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుది ఫలితాల తర్వాత రెండు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలతో జాగ్రత్త వహిస్తోంది. ఎన్నికల్లో చైనా జోక్యం, కరోనా మహమ్మారి వంటి అంశాలతో ఆ దేశానికి ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. బైడెన్ జోరు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు విడుదలైన చివరి సర్వేలోనూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్​పై 10 పాయింట్ల తేడాతో జోరు కనబరుస్తున్నారు. హోరాహోరీ పోరు జరిగే రాష్ట్రాల్లోనూ ఓటర్లు బైడెన్​కే అనుకూలంగా ఉన్నారు. అయితే శ్వేతజాతీయులు, డిగ్రీ పట్టా లేని తెల్ల ఓటర్లలో ట్రంప్ హవా కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రిలయన్స్ ఢమాల్

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్ల సెషన్ ఆరంభం నుంచే ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంస్థ షేర్లు ప్రస్తుతం 6 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. బీసీసీఐకి కిట్​ స్పాన్సర్​ దొరికేసింది

టీమ్​ఇండియా కిట్ల స్పాన్సర్​ కోసం ఎమ్​పీఎల్​ సంస్థతో మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది బీసీసీఐ. దీని ద్వారా ఒక్కో మ్యాచ్​కు రూ.65 లక్షలు ఆర్జించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. షారుక్​ గురించి ఈ విషయాలు తెలుసా?

షారుక్​ ఖాన్ అనగానే స్టార్ హీరో, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్​లో కోల్​కతా జట్టు యజమాని అనే గుర్తొస్తాయి. కానీ ఆయన గతంలో ఓసారి జైలుకు వెళ్లారని, ఇంట్లో ఇస్లామ్ ప్రార్ధనలతో పాటు, హిందు దేవుళ్లను పూజిస్తారని మీకు తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.