ETV Bharat / city

Telangana News : టాప్ న్యూస్​ @11AM

author img

By

Published : May 9, 2022, 11:01 AM IST

TOP TEN NEWS
TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • బాధితులకు మోదీ పరిహారం

కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

  • రైతు ఇంట.. ముత్యాల పంట

మూస పద్ధతి వ్యవసాయానికి స్వస్తి పలికి ముత్యాల సాగుకు నడుం కట్టారు జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన రైతు సలీమ్‌. తీరప్రాంతాల్లోనే కనిపించే ఆల్చిప్పల పెంపకాన్ని ఆయన ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 23 ఏళ్లపాటు సౌదీ అరేబియాలో ఉండి చేపల పెంపకంపై తాను సంపాదించిన అవగాహనా ఇందుకు ఆసరా అయింది. 20 గుంటల స్థలంలో ట్యాంకుల్లో కొర్రమీను చేపలతో పాటు ఆల్చిప్పలూ పెంచుతున్నారు.

  • ఇళ్లలో అధిక లోడుకు అభివృద్ధి రుసుం వసూలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,900 కోట్ల అంతర్గత ఆదాయం సమకూర్చుకోవాలనే ఆదేశాల నేపథ్యంలో అభివృద్ధి ఛార్జీలపై విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రతి మీటరునూ తనిఖీ చేసి.. కనెక్షన్‌ తీసుకున్న సమయంలో తెలిపిన లోడు ప్రకారమే ఆ ఇంటిలో కరెంటు వాడుతున్నారా? అనేది పరిశీలించి బిల్లులు వేయాలని తాజాగా ఆదేశాలు జారీచేశాయి.

  • విద్యార్థులకు ఫీజుల తిప్పలు

పేదరికంలో ఉన్నా కొందరు ప్రతిభావంతులైన విద్యార్థులు జాతీయస్థాయి నీట్‌లో లక్షల మంది నుంచి పోటీ ఎదుర్కొని మంచి ర్యాంకులతో మెరుస్తున్నారు. కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్‌ సీట్లు సాధిస్తున్నారు. ట్యూషన్‌ ఫీజును రీయింబర్స్‌మెంట్‌ రూపేణా సర్కారు మంజూరు చేస్తున్నా, ఇతర ఖర్చులను తలచుకొని ఆ విద్యార్థులు కుమిలిపోతున్నారు.

  • రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు. చాలా చోట్ల రహదారులు జలమయం అయ్యాయి.

  • పిజ్జా తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..

ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్​ చేసిన 23 ఏళ్ల యువకుడు.. రెండు ముక్కలు తిన్న వెంటనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా గుండె ఆగి చనిపోయాడు. రెండేళ్ల క్రితం నాటి ఈ ఘటనపై మంగళవారం విచారణ ప్రారంభంకానుండగా.. న్యాయం కోసం మృతుడి తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • భారీ నష్టాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 600 పాయింట్ల నష్టంతో 54,233 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 16,233 వద్ద కొనసాగుతోంది.

  • తగ్గిన బంగారం ధర... నేడు ఎంతంటే?

బంగారం, వెండి ధరలు ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.80కిపైగా దిగొచ్చింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర సైతం రూ.150 వరకు తగ్గింది.

  • ధోనీ సూపర్​ రికార్డ్​..

ఈ ఐపీఎల్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్ ధోనీ అరుదైన ఫీట్​ సాధించాడు. ఈ లీగ్​ డెత్​ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల మెగాలీగ్​ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు.

  • నవ్వులు పూయిస్తున్న 'ఎఫ్​ 3' ఫన్​ ట్రైలర్​

నవ్వులు పంచేందుకు 'ఎఫ్ 3' ఫన్​ ట్రైలర్​ వచ్చేసింది.​ 2.35 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. "ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ప్రపంచానికి తెలియనిది ఒకటి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.