ETV Bharat / spiritual

ఆ రాశివారు ఈరోజు కొత్త పనులు మొదలుపెట్టకండి! కోపాన్ని కంట్రోల్​లో ఉంచుకోండి!! - daily horoscope in telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 4:57 AM IST

Horoscope Today May 8th 2024 : మే​ 8న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 8th 2024
Horoscope Today May 8th 2024 (ETV Bharat)

Horoscope Today May 8th 2024 : మే​ 8న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. మీ సహజ లక్షణాలైన దూకుడు, ఆధిపత్య ధోరణి తగ్గించుకుంటే మేలు. కోపాన్ని నియంత్రిచుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే ముందు బాగా అలోచించి ఒక దృఢమైన నిర్ణయానికి వస్తే మేలు. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వ్యాపారస్థులకు భాగస్వాముల మధ్య విబేధాలు రావచ్చు. మానసిక అశాంతి కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగస్థులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ఖర్చులు అధికం అవుతాయి. గణపతి ఆరాధనతో విఘ్నాలు తొలగుతాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. దైవబలం మీకు అండగా ఉంటుంది. వ్యాపాస్థులకు ధన ప్రవాహం ఉంటుంది. నూతన ప్రాజెక్టులను దక్కించుకుంటారు. ఉద్యోగస్థులు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి యజమానుల ప్రశంసలు పొందుతారు. ఆర్ధికంగా పలు ప్రయోజనాలను అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో వేడుకలు జరుగుతాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్థులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టాలు సూచితం. అనుకొని ఖర్చులు వచ్చి పడటం వల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. శని స్తోత్రం పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. గతంలో మీరు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన సమయం. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఛాన్స్ తప్పకుండా ఉంది. వృత్తి నిపుణులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సరదాగా, సంతోషంగా గడిచిపోతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. ఉద్యోగస్థులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. సన్నిహితుల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. గతంలో వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్థులకు శ్రమకు తగిన ఫలం ఉంటుంది. కనకధారా స్తోత్రం పఠిస్తే శుభకరంగా ఉంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మానసికంగా అశాంతితో ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు. ఉద్యోగస్థులకు పని భారం పెరుగుతుంది. ఆశించిన ప్రయోజనాలు ఉండవు. వ్యాపారస్థులకు వ్యాపారం మందకొడిగా ఉంటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాలవారికి అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే మంచిది. మానసికంగా అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం బాగుండదు. వైద్య చికిత్సల కోసం ధనవ్యయం ఉంటుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇంట్లో గొడవలు ఎక్కువవుతాయి. మీ ప్రియమైన వారితో గొడవలతో మీరు నిరుత్సాహంగా ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన చేస్తే శత్రుజయం ఉంటుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సానుకూల ఆలోచనలను పెంచుకోండి. అనవసర ఆందోళనలను తొలగించుకుంటే, అన్ని పనుల్లో విజయం మీదే! కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి.ఉద్యోగస్థులకు కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. జీతం పెరుగుదలకు కూడా అవకాశం ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పై అధికారులతో, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అపార్ధాలకు అవకాశం ఉంది. ఈ రోజు ఏం మాట్లాడినా అది వ్యతిరేకంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. అపార్థానికి వివాదమే ఫలితం. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఎవరికీ రుణాలు ఇవ్వద్దు రుణాలు తీసుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధనతో విఘ్నాలు తొలగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.