ETV Bharat / city

'కేసీఆర్​ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం.. కులవృత్తులు నిర్వీర్యం'

author img

By

Published : Apr 12, 2022, 3:11 PM IST

Bandi Sanjay Comments: హైదరాబాద్​లో నిర్వహించిన బీసీ విద్యావంతుల సదస్సులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని బండి సంజయ్​ ఆక్షేపించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో.. రెండో విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ఏర్పాట్లపై చర్చించారు.

bjp leader bandi sanjay comments on cm kcr about  Injustice to bc community
bjp leader bandi sanjay comments on cm kcr about Injustice to bc community

Bandi Sanjay Comments: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కుల వృత్తులను సైతం నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్​ మండిపడ్డారు. హైదరాబాద్​లో నిర్వహించిన బీసీ విద్యావంతుల సదస్సులో పాల్గొన్న బండి సంజయ్​.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీల కోసం ఉద్యమం చేస్తోన్న పార్టీ భాజపా అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు వస్తారని.. ఎద్దేవా చేశారు. మేధావి వర్గం వహిస్తోన్న మౌనం.. అవినీతిపరులకు ఆయుధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆక్షేపించారు.

"ఒక ఓబీసీ వ్యక్తిని భాజపా గుజరాత్​కు ముఖ్యమంత్రి చేస్తే అభివృద్ధి చేసి చూపించారు. అలాంటి ఓ సత్తా ఉన్న వ్యక్తిని దేశ ప్రధానిని చేసింది భాజపా. నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఓబీసీలకు అనుకూలం. బీసీ కమిషన్​కు భాజపా ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. అబద్దాలు ఆడటంలో కేసీఆర్​కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. ఓబీసీల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. కటిక కులస్థులు నిర్వహించాల్సిన మటన్ దుకాణాలు ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతీ చోట బీసీలకు తీవ్ర నష్టం కలుగుతోంది." - బండి సంజయ్​, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు

యాత్రను భగ్నం చేసేందుకు యత్నం..: ఈ నెల 14 నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ మేరకు సీఎం ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్లు తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధమయ్యామన్నారు. రైతుల ముసుగులో తెరాస దాడులు చేసినా.. భాజపా కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని కోరారు.

'కేసీఆర్​ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం.. కులవృత్తులు నిర్వీర్యం'

ఇదీ చూడండి: 'జీహెచ్​ఎంసీ బడ్జెట్ భేటీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.