ETV Bharat / city

'హోర్డింగ్ పరిశ్రమ గొంతు నులిమే జీవో-68 రద్దు చేయాలి'

author img

By

Published : Dec 23, 2020, 6:54 PM IST

all party leaders protest at dharna chowk supporting to hoarding industry
'హోర్డింగ్ పరిశ్రమ గొంతు నులిమే జీవో-68 రద్దు చేయాలి'

హోర్డింగ్ ఇండస్ట్రీకి మద్ధతుగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నాచౌక్​లో ఆందోళన చేపట్టారు. హోర్డింగ్ పరిశ్రమ గొంతు నులిమే జీవో నెంబరు 68ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవో నెంబర్‌ 68 వెంటనే రద్దు చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. హోర్డింగ్‌ వ్యవస్థకు మరణ దండన లాంటిందని మండిపడ్డారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌, ధర్నాచౌక్‌ వద్ద ఔట్​డోర్‌ అడ్వర్టైజింగ్‌ మీడియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బంధువులకు కట్టబెట్టేందుకే జీవో నెంబర్‌ 68 తీసుకొచ్చారని నేతలు ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల లక్ష మంది ఉపాధి కోల్పోతున్నారని... పరోక్షంగా 4 లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ప్రొఫెసర్ నాగేశ్వర్​ ఆరోపించారు. హైదరాబాద్‌ అందంగా ఉండాలని హోర్డింగ్‌లను రద్దు చేయడం దారుణమన్నారు. అడ్వర్టైజింగ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 150 కోట్ల ఆదాయం వస్తుందని... దీనిని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో హోర్డింగ్‌ లేకుండా ఏ దేశం లేదని... ఎక్కడ లేని అంక్షలు గ్రేటర్‌లో ఎందుకు అని ప్రశ్నించారు.

జీవో 68 తీసుకొచ్చినప్పుడు ఎవరినైనా సంప్రదించారా... ముందుకు దానికి ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదన్నారు. నగరంలో 350 హోర్డింగ్‌ కంపెనీలు మూతపడ్డాయని నేతలు అవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హోర్డింగ్‌ ఇండస్ట్రీ రూ. 8 వేల కోట్లు నష్టపోతుందని... సేవ్‌ హోర్డింగ్‌ ఇండస్ట్రీ అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రంగంలో ఆధారపడి జీవిస్తున్నామని ఇప్పుడు మా కడుపులు కొట్టొందని ప్రభుత్వాన్ని హోర్డింగ్ కార్మికులు వేడుకున్నారు. జీవో 68ని రద్దు చేయకపోతే మాకు, మా కుటుంబాలు ఆత్మహత్యలే దిక్కు అని వాపోయారు.

'హోర్డింగ్ పరిశ్రమ గొంతు నులిమే జీవో-68 రద్దు చేయాలి'

ఇదీ చూడండి: 'వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.