ETV Bharat / business

ఫాస్టాగ్​ నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యమా? ఆ వీడియోల్లో నిజమెంత?

author img

By

Published : Jun 27, 2022, 6:13 PM IST

FASTAG NEWS: టోల్​ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని లేకుండా.. సులభంగా టోల్​ రుసుము చెల్లించేందుకు కొన్నేళ్ల క్రితం ఫాస్టాగ్​ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అయితే ఫాస్టాగ్​ను నుంచి డబ్బులు దొంగిలించవచ్చా? మనకు తెలియకుండానే ఫాస్టాగ్​ నుంచి బ్యాలెన్స్ కట్ అయిపోతుందా? అవునంటూ ఇటీవల అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నిజమో? కాదో? ఓ సారి చూద్దాం.

fastag
ఫాస్టాగ్

FASTAG NEWS: ఫాస్టాగ్​ నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యమా? టోల్​గేట్​తో సంబంధం లేకుండానే బ్యాలెన్స్ కట్ అవుతుందా? అద్దం తుడుస్తున్న ముసుగులో సరికొత్త దోపిడీకి పాల్పడుతున్నారా? ఫాస్టాగ్​ బ్యాలెన్స్​ చోరీపై వైరల్ వీడియోస్​లో నిజమెంత? ఓ సారి తెలుసుకుందామా..

ఫాస్టాగ్​ను స్కాన్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వద్ద నమోదైన టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా మర్చంట్స్‌కు మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లను స్కాన్ చేసి డబ్బులు తీసుకునే అధికారం ఉంటుందని తెలిపింది. అనధికార పరికరాలు ఏవీ ఫాస్టాగ్‌లోంచి డబ్బులు తీసుకోలేవని స్పష్టం చేసింది.

ఓపెన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ఎటువంటి లావాదేవీలు జరగవని ఎన్‌పీసీఐ తెలిపింది. టోల్​ ప్లాజాలోని సర్వర్​ రూమ్​ హార్డ్​వేర్​ సెక్యూరిటీ మాడ్యూల్(హెచ్​ఎస్ఎమ్​) పటిష్ఠ భద్రతను కలిగి ఉంటుందని వెల్లడించింది. టోల్​ ప్లాజాలో ఉన్న రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్​ఎఫ్​ఐడీ) స్కాన్ ద్వారానే లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది.​ కారు టోల్ ప్లాజాను దాటిన తర్వాత అవసరమైన టోల్ ఫీజు ఫాస్టాగ్ ఖాతా నుంచి గానీ, ఫాస్టాగ్​ ప్రీపెయిడ్​ వాలెట్ నుంచి కానీ కట్ అవుతుందని తెలిపింది. ఫాస్టాగ్ నుంచి వ్యక్తిగత లావాదేవీలు జరగవని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?

వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ.. గ్రాట్యుటీ ఎక్కువ.. జులై 1 నుంచి కొత్త రూల్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.