ETV Bharat / business

మీ కారులో స్టీరింగ్​ వీల్ కవర్ లేదా? - వస్తువు చిన్నదే, సేఫ్టీ పెద్దది!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 2:46 PM IST

Steering Wheel Cover Benefits
Steering Wheel Cover Benefits

Steering Wheel Cover Benefits: కారు అనగానే చాలా మంది ముందుగా దాని లుక్ చూస్తారు.. తర్వాత మైలేజ్ చూస్తారు. ఇంటీరియర్ డిజైన్​ చెక్ చేసుకుంటారు. కానీ.. కారు స్టీరింగ్​ వీల్​ కవర్ గురించి మాత్రం పట్టించుకోరు. అయితే.. తప్పకుండా స్టీరింగ్​కు కవర్ వేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Steering Wheel Cover Benefits : ప్రస్తుత రోజుల్లో కారు అవసరంగా మారింది. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉన్నవారంతా తీసుకుంటున్నారు. అయితే.. దాని సేఫ్టీపైనా అంతే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ చిన్న విషయాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. అయితే.. అందరూ ఇతర విషయాలపై దృష్టిపెట్టినప్పటికీ.. డ్రైవింగ్​లో మేజర్​ రోల్​ పోషించే స్టీరింగ్​ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదట. ఈ స్టీరింగ్‌ వీల్​కు తప్పకుండా కవర్‌ వేయించాలని సూచిస్తున్నారు. లేకపోతే కొన్ని నష్టాలు జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

చాలా మంది స్టీరింగ్​కు కవర్ అవసరం లేదని అంటారు. లైట్ తీసుకుంటారు. కానీ.. స్టీరింగ్ వీల్​తోపాటు మొత్తం డ్రైవింగ్ సేఫ్టీలో కవర్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన దగ్గరి వాతావరణం ప్రకారం కూడా స్టీరింగ్‌ వీల్​కు కవర్ అవసరమని అంటున్నారు. వేడి, చలి కాలాల్లో వచ్చే సమస్యల నుంచి డ్రైవర్‌కు ఉపశమనం కలిగిస్తుందని సూచిస్తున్నారు. స్టీరింగ్​ వీల్​ కవర్​ ద్వారా కలిగే పలు ప్రయోజనాల గురించి చూస్తే..

కారు ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!

గ్రిప్: స్టీరింగ్ వీల్ కవర్లు సాధారణంగా రబ్బరు లేదర్ లేదా ఫాబ్రిక్ వంటి మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇది.. స్టీరింగ్ వీల్‌పై డ్రైవర్​ పట్టును మెరుగుపరుస్తుంది. ఉదాహరకణకు ఎండా కాలంలో డ్రైవింగ్ చేసే వారి చేతులకు చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చేతులు జారిపోవచ్చు. ఈ సమయంలో స్టీరింగ్ తిప్పడంలో తేడా జరిగితే ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. గ్రిప్ పర్ఫెక్ట్​గా ఉండడం మంచిది. అంతేకాదు.. చేతులకు చక్కటి గ్రిప్ లభిస్తే.. తక్కువ శక్తిని ఉపయోగించే.. స్టీరింగ్ ను కంట్రోల్​ చేయొచ్చు.

క్లచ్​ లైఫ్​ టైమ్​ పెరగాలా? కారు డ్రైవింగ్​ సమయంలో ఈ తప్పులు చేయకండి!

కంఫర్ట్: చాలా వరకు స్టీరింగ్ వీల్ కవర్‌లు మృదువైన పదార్థాలతో తయారవుతాయి. ఇది స్టీరింగ్ వీల్‌ను పట్టుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది లాంగ్ డ్రైవ్‌ టైమ్​లో చేతుల అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్షణ: స్టీరింగ్ వీల్ కవర్లు మీ స్టీరింగ్ వీల్‌ను దుమ్ము, గీతల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది స్టీరింగ్ వీల్ లైఫ్​టైమ్​ పొడిగించి.. దాని రూపాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా కారు లోపలి భాగాన్ని శుభ్రంగా, కొత్తదానిలా ఉంచుతుంది.

కారు బ్రేకులు త్వరగా దెబ్బతింటాయి - ఇలా చేయండి

స్టైల్: చాలా మంది స్టీరింగ్ వీల్ కవర్ల కారణంగా కారు లుక్ పోతుందని భావిస్తారు. కానీ.. వివిధ రంగులు, డిజైన్‌లు, మెటీరియల్స్​లో ఇవి లభిస్తున్నాయి. కాబట్టి మీ కారుకు సూటయ్యే కవర్​నే ఎంచుకోవచ్చు.

ఇలా చేయకపోతే - మీ కారు బ్యాటరీ లైఫ్​ దారుణంగా తగ్గిపోతుంది!

మీ కారులో ఆడియో సిస్టమ్ ఇబ్బంది పెడుతోందా? - ఇలా మెయింటెయిన్ చేయండి!

ఇలా నడిపితే - మీ కారు షెడ్డుకి పోవడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.