ETV Bharat / business

మీ కారులో ఆడియో సిస్టమ్ ఇబ్బంది పెడుతోందా? - ఇలా మెయింటెయిన్ చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 1:20 PM IST

Car Audio System Maintenance Tips : కారు ఆడియో సిస్టమ్​లో తరచుగా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తోందా? అయితే ఇది మీకోసమే. మేం చెప్పే టిప్స్ పాటించారంటే.. మీ ఆడియో సిస్టమ్ మంచి కండిషన్​లో ఉండడమే కాదు.. ఎక్కువ కాలం పనిచేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Car Audio System
Car Audio System

Best Tips for Car Audio System Maintenance : చాలా మంది కారు ఇంజిన్, బ్యాటరీ, డ్యాష్ బోర్డ్ వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. ఆడియో సిస్టమ్​ మెయింటెనెన్స్ అస్సలు పట్టించుకోరు. దాంతో కొన్ని రోజులకే అది పాడైపోతుంది. అలాంటి వారు ఈ టిప్స్ పాటించారంటే వెహికల్ ఆడియో సిస్టమ్ ఎక్కువ కాలం మంచి కండిషన్​లో ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాఫ్ట్ మైక్రోఫైబర్ యూజింగ్ : కారు ఆడియో సిస్టమ్ మంచి కండిషన్​లో ఉండడంలో హెడ్ యూనిట్, స్పీకర్లు, యాంప్లిఫయర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటన్నింటితో ఆడియో సిస్టమ్ యూనిట్​ను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. వీటిపైన పడిన దుమ్ము, దూళిని తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా ఉండే కెమికల్స్​ను వాడకూడదు. అలా కాదని యూజ్ చేస్తే అవి ఆడియో సిస్టమ్ పార్ట్స్​ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లీనింగ్​కు సాఫ్ట్ మైక్రోఫైబర్ మాత్రమే యూజ్ చేయాలి.

లో వాల్యూమ్ మెయింటెనెన్స్ : కారు ఆడియో సిస్టమ్​లో త్వరగా రిపేర్​కు వచ్చేవి స్పీకర్​లు. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది కారులో పాటలు వినడానికి హై వాల్యూమ్​లో మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. అలా ఎక్కువ సమయం ఉంచారనుకో స్పీకర్​లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ లో వాల్యూమ్​లో సాంగ్స్ వినడం బెటర్.

కనెక్షన్స్ చెకింగ్ : కారు ఆడియో సిస్టమ్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పనేంటంటే.. ఆడియో సిస్టమ్‌ను క్లీన్​చేసేటప్పుడు కనెక్షన్స్ చెక్ చేయడం. అంటే ఏవైనా ఈ సిస్టమ్​కు సంబంధించిన కనెక్షన్స్ లూజ్​గా ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా తుప్పు పట్టి ఉన్నాయా అనేది తనిఖీ చేసుకోవాలి. వీటితో పాటు.. ఎక్కడైనా తేమ లాంటిది ఉందా అనేదీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా మీ కారు ఆడియో సిస్టమ్ యూనిట్లు త్వరగా రిపేర్​కు వస్తాయి. కాబట్టి తరచుగా వీటిని చెక్ చేసుకోవడం ఉత్తమం.

ఎలక్ట్రిక్ కార్స్, బైక్స్ వాడుతున్నారా? శీతాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

కారు పార్కింగ్ : చాలా మంది కారు పార్కింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు. అది కూడా ఆడియో సిస్టమ్​పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న టైమ్​లో మీరు ఎండకు కారు పెట్టారంటే పెయింటింగ్, టైర్లు దెబ్బతినడమే కాకుండా కారు క్యాబిన్ యూనిట్ ఆడియో సిస్టమ్​పై కూడా ప్రభావం పడుతుంది. ఆ కారణంగా ఆడియో సిస్టమ్​లో కొన్ని యూనిట్లు పాడయ్యే ఛాన్స్ ఉంది.

బ్యాటరీ చెకప్ : మీ కారు ఆడియో సిస్టమ్ ఎక్కువ కాలం మంచి కండిషన్​లో ఉండడంలో బ్యాటరీ కూడా కీలకం. ఎందుకంటే బ్యాటరీ పవర్ ద్వారానే ఆడియో సిస్టమ్ నడుస్తుంది. అదే ఒకవేళ బ్యాటరీ చెడిపోతే అది ఆడియో సిస్టమ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వెహికల్ మెయింటెనెన్స్ విషయంలో బ్యాటరీని తరచుగా చెక్ చేస్తుండాలి.

ఆడియో సిస్టమ్ ఆన్, ఆఫ్ : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. ఎక్కడికైనా వెళ్లొచ్చాక ఆడియో సిస్టమ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఆ కారణంగా కూడా మీ కారు ఆడియో సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే వెహికల్ ఇంజిన్ ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు వోల్టేజ్ స్పైక్​లు ఆడియో సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఇంజిన్​తో పాటు దీనిని ఆఫ్ చేయడం బెటర్. అలాగే ఇతర యూనిట్లు ఎక్కువ కాలం రావాలని రెగ్యులర్​గా ఎలా యూజ్ చేస్తామో అదే మాదిరిగా దీనినీ డైలీ వర్క్ చేసేలా చూడాలి. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీ కారు ఆడియో సిస్టమ్ ఎక్కువకాలం మంచి కండిషన్​లో ఉంటుంది.

ఇలా నడిపితే - మీ కారు షెడ్డుకి పోవడం గ్యారెంటీ!

సెకండ్​ హ్యాండ్​ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.