ETV Bharat / business

ఎలక్ట్రిక్ కార్స్, బైక్స్ వాడుతున్నారా? శీతాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 5:37 PM IST

Tips For Maintaining Electric Cars In Cold Weather In Telugu : మీరు ఎలక్ట్రిక్ కార్స్, బైక్స్ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. శీతాకాలంలో, చల్లని వాతావరణంలో విద్యుత్‌ వాహనాల పనితీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే కిందకు పడిపోతే మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips For Maintaining EVs in winter season
Tips for Maintaining Electric Cars in Cold Weather

Tips For Maintaining Electric Cars In Cold Weather : శీతాకాలం ప్రారంభమైంది. గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇలాంటి చల్లని వాతావరణంలో విద్యుత్‌ వాహనాల (EV) పనితీరు బాగా తగ్గుతుంది. ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీల ఛార్జింగ్‌ త్వరగా తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? శీతల వాతావరణంలో విద్యుత్ వాహనాలను ఎలా మెయింటైన్‌ చేయాలి? ఛార్జ్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పనితీరు తగ్గుతుంది!
How Does Cold Weather Affect Electric Vehicles : శీతాకాలంలో, చల్లని వాతావరణాల్లో ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు సాధారణం కంటే 20-30 శాతం తగ్గుతుందని ఈవీ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. దీనికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవి :

  1. బ్యాటరీ పనితీరు తగ్గడం
  2. శక్తి వినియోగం పెరగడం

విద్యుత్ వాహనాల్లో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు 15-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో చక్కగా పనిచేస్తాయి. కానీ చలికాలంలో వాహనాలకు అవసరమైన ఉష్ణోగ్రత ఉండదు. అందువల్ల బ్యాటరీల నుంచే ఎక్కువ శక్తిని వాడుకోవాల్సి వస్తుంది. అందువల్ల సాధారణ సమయాల్లో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

ఉష్ణాగ్రతలు బాగున్నప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీని వల్ల బ్యాటరీ కొంత మేరకు ఛార్జ్​ కూడా అవుతుంది. కానీ శీతాకాలంలో ఈ బ్రేకింగ్ వ్యవస్థ అంత సమర్థవంతంగా పనిచేయదు. అందువల్ల చల్లని వాతావరణంలో ఈవీ వెహికల్స్ డ్రైవ్​ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అంతేకాదు మాన్యువల్ బ్రేకింగ్‌ను కూడా ఉపయోగించాల్సి రావచ్చు.

ఇలా ఎందుకు జరుగుతుంది?
EV Battery Life In Cold Weather : శీతల వాతావరణంలో లిథియం-అయాన్‌ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్‌ ద్రవం మందంగా మారుతుంది. దీనితో ఎలక్ట్రోకెమికల్‌ ప్రక్రియ కాస్త నెమ్మదిస్తుంది. ఫలితంగా బ్యాటరీల అంతర్గత నిరోధం పెరుగుతుంది. దీనితో లిథియం అయాన్లు - యానోడ్‌, క్యాథోడ్‌ల మధ్య సులభంగా చలించలేవు. ఇలాంటి స్థితిలో బ్యాటరీ నుంచి ఒక్కసారిగా శక్తిని తీసుకోవడం ప్రారంభిస్తే, వోల్టేజ్‌ గణనీయంగా పడిపోయి డిశ్ఛార్జ్​కు దారితీస్తుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
How To Keep Electric Car Battery Charged In Cold Weather :

  • శీతాకాలంలో వీలైనంత వరకు ఈవీలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్‌ చేయకపోవడమే మంచిది. షెడ్స్​ లాంటి ఇండోర్ ప్రదేశాల్లో పార్క్‌ చేయడం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది. ఇవేవీ కుదరకపోతే కనీసం కవర్‌తోనైనా ఈవీలను కప్పి ఉంచాలి.
  • ఈవీ కార్స్​, బైక్స్ లాంటి వాటిల్లో ఛార్జింగ్‌ 20 శాతం కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలి. లేదంటే వాహనాన్ని స్టార్ట్‌ చేసినప్పుడు బ్యాటరీ నుంచి ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో బ్యాటరీ మరింత తొందరగా డిశ్ఛార్జ్‌ అవుతుంది. ఒకవేళ చలికాలంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే, కనీసం 80 శాతానికి పైగానే ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలి.
  • ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఎలక్ట్రిక్ కార్లను కచ్చితంగా ప్రీ-కండిషన్‌ చేయాలి. ఇంటీరియర్‌ను వేడెక్కించడానికి బ్యాటరీ నుంచే శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. కనుక బ్యాటరీ ఫుల్​ ఛార్జింగ్​లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • వాహనాల పనితీరుపై టైర్లలోని ఎయిర్​ ప్రెషర్​ కూడా ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా టైర్లలో గాలి ఒత్తిడి మారుతుంటుంది. ఇది ఈవీల రేంజ్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే టైర్లలో సరిపడా గాలి ఉండేలా చూసుకోవాలి.
  • చలికాలంలో బ్యాటరీ రీఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్యాటరీ చల్లగా ఉంటే ఛార్జ్ కావడానికి మరింత సమయం తీసుకుంటుంది. అందుకే బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడే ఛార్జింగ్‌ పెట్టడం మంచిది.

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే!

కొత్త బైక్ కొనాలా? రూ.61 వేల నుంచి రూ.1.60 లక్షల రేంజ్​లోని టాప్​​-10 టూ-వీలర్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.