ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ చిక్కులకు చెక్​ - త్వరలో గవర్నమెంట్ పోర్టల్​! - Health Insurance Claim Govt Portal

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 12:50 PM IST

Health Insurance Claim Govt Portal : ఆరోగ్య బీమా క్లెయిమ్ ఇప్పుడు మరింత సులభం కానుంది. క్లెయిమ్ సెటిల్​మెంట్స్​ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సరికొత్త పోర్టల్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

health insurance claim process
health insurance (ETV Bharat)

Health Insurance Claim Govt Portal : ఆరోగ్య బీమా పాలసీ అత్యవసర సమయంలో అండగా నిలుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకోకుండా ఆదుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఆరోగ్య బీమా క్లెయిమ్స్ తిరస్కరణకు గురవుతుంటాయి. అవసరమైన పత్రాలు సమర్పించకున్నా, చాలా ఆలస్యంగా సమర్పించినా క్లెయిమ్​లను తిరస్కరిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అన్ని వివరాలను సరిగ్గా పేర్కొన్నా కూడా క్లెయిమ్ సెటిల్​మెంట్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్​మెంట్లను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలోనే 'నేషనల్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్'ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా మారనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది.

ఇకపై ఆలస్యం కాకుండా!
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రభుత్వం ఈ కొత్త పోర్టల్​ను తీసుకువస్తోంది. దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రానున్న రెండు, మూడు నెలల్లో దేశమంతటా ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 50 బీమా కంపెనీలు, 250 అసుపత్రులను కూడా అనుసంధానించింది. క్రమంగా మరిన్ని ఆసుపత్రులను, బీమా ప్రొవైడర్లనూ అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ టీపీఏ, బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టల్​తో అనుసంధానాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్స్ సెటిల్​మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానాలపై ఆధారపడి ఉంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త పోర్టల్​ను తీసుకురానుంది.

IRDAI Removes Age Limits On Health Insurance : ఇప్పుడు 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఐఆర్​డీఏ 2024 ఏప్రిల్​ 1 నుంచే ఈ మార్పు అమల్లోకి తెచ్చింది. ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయో పరిమితి 65ఏళ్లుగా ఉండేది. ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చని IRDA తెలిపింది. అంటే అన్ని వయస్సుల వారికీ బీమా సంస్థలు పాలసీలు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్‌ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీలు డిజైన్‌ చేవచ్చని IRDA తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ITR​ ఫైల్ చేయాలా? ముందుగా AISను సరిచూసుకోండిలా! - What Is AIS

లార్జ్​ క్యాప్ Vs మిడ్​ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Different Mutual Funds

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.