ETV Bharat / business

క్లచ్​ లైఫ్​ టైమ్​ పెరగాలా? కారు డ్రైవింగ్​ సమయంలో ఈ తప్పులు చేయకండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 4:56 PM IST

How to Maintain Clutch Life Time in Manual Cars: ప్రస్తుత మార్కెట్లో ఆటోమేటిక్​ గేర్​ కార్ల హవా నడుస్తోంది. క్లచ్​తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగాలని ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నా.. చాలా మంది కస్టమర్లు మాత్రం మాన్యువల్​ గేర్​ కార్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కార్లలో ఉన్న ప్రధాన సమస్య​ క్లచ్‌. మరి క్లచ్ లైఫ్​​ టైమ్​ పెరగాలంటే ఈ టిప్స్​ ఫాలో కావాలంటున్నారు నిపుణులు..

Clutch Life Time
Clutch Life Time

Tips to Increase Clutch Life Time in Manual Cars: కారు కొనుగోలు చేసి.. ఫ్యామిలితో ట్రిప్స్​కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్టుగానే కార్లను కొంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో కార్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేటిక్ గేర్ కార్లు వచ్చినప్పటికీ.. కార్​ లవర్స్​ మాత్రం మాన్యువల్ గేర్ కార్లనే ఎక్కువగా ఇష్టపడతున్నారు. అయితే ఈ కార్లలో ఓ మెయిన్​ ప్రాబ్లమ్​ ఉంది. అదే క్లచ్‌. కొద్దిమందికి కారు డ్రైవ్​​ చేసే సమయంలో క్లచ్‌ని ఎప్పుడు ప్రెస్​ చేయాలి..? ఎప్పుడు ఉపయోగించకూడదో తెలియడం లేదు. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. క్లచ్​ లైఫ్​ టైమ్​కు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు ఆటోమొబైల్​ రంగ నిపుణులు..

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది!

Clutch Maintenance: మాన్యువల్ గేర్ కార్లలో క్లచ్ కీ రోల్​ ప్లే చేస్తుంది. ఒకవేళ క్లచ్ పాడైపోతే కారు వర్క్​ అవ్వదు. క్లచ్‌.. ఇంజిన్, గేర్‌బాక్స్ మధ్య వంతెనలా పనిచేస్తుంది. కాబట్టి కారు డ్రైవ్‌ చేసే సమయంలో క్లచ్​ను కేర్​ఫుల్​గా ఉపయోగించాలి. దీని ద్వారా, కారు రిపేర్‌ అవ్వకుండా చూసుకునే వీలుంటుంది. లేదంటే మెయింటెనెన్స్‌పై చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ తప్పులను చేయకుండా ఉండటం ద్వారా క్లచ్​ లైఫ్​ టైమ్​ను పెంచుకోవడంతో పాటు మైలేజ్​ను కూడా ఆదా చేసుకోవచ్చు..

క్లచ్ అండ్ యాక్సిలరేటర్: ఎత్తైన రోడ్లు ఎక్కేటప్పుడు కారు డ్రైవ్​ చేసేవారు.. తరచుగా బ్రేక్ బదులు క్లచ్ ఇంకా యాక్సిలరేటర్‌ను యూజ్​ చేస్తారు. ఈ కారణంగా కారు క్లచ్ వేగంగా హీటెక్కుతుంది. కొన్నిసార్లు దెబ్బతింటుంది కూడా. ఎక్కువ ఎత్తులో క్లచ్, యాక్సిలరేటర్ ఎక్కువగా వాడటం వల్ల క్లచ్ లైఫ్​పై ప్రభావం చూపుతుంది. తద్వారా క్లచ్ ప్లేట్స్ త్వరగా అరిగిపోతాయి. క్లచ్ కారును వెనుకకు వెళ్లకుండా ఉండటానికి ఎక్కువ శక్తిని గేర్ ట్రాన్స్మిషన్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఈ మొత్తం ప్రక్రియ చాలా హీట్​ను జనరేట్​ చేస్తుంది. ఇది క్లచ్ ఫెయిల్​ లేదా అగ్ని ప్రమాదాలను పెంచే అవకాశం ఉంటుంది.

మీ కారు విండ్‌ షీల్డ్‌పై పగుళ్లు వచ్చాయా? ఇలా సెట్ చేయండి!

క్లచ్​పై ప్రెజర్​ పెట్టకూడదు: మాన్యువల్‌ కార్‌ డ్రైవర్లు ఎక్కువగా చేసే మిస్టేక్​ ఏంటంటే.. క్లచ్‌పై చాలా వేగంగా ప్రెజర్‌ పెడుతుంటారు. లేదా సడెన్‌గా దానిపై నుంచి కాలు తీస్తారు. అలా కాకుండా స్లోగా క్లచ్‌పై కాలు పెట్టడం, తీయడం చేయాలి. అప్పుడే క్లచ్‌ సేఫ్​గా ఉంటుంది.

ట్రాఫిక్ జామ్‌లో క్లచ్‌ను పట్టుకోవడం: చాలా మంది ట్రాఫిక్ జామ్​లో క్లచ్‌తో ఎక్కువ సేపు డ్రైవ్ చేస్తారు. దీనివల్ల క్లచ్​పై చాలా ప్రెజర్​ పడుతుంది. కారు 20 సెకన్ల కన్నా ఎక్కువ సమయం ముందుకు వెళ్లకపోతే న్యూట్రల్​లో ఉంచండి. క్లచ్ పెడల్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచడం వల్ల క్లచ్ బాల్ బేరింగ్ పాడవుతుంది. బేరింగ్లను మార్చే వీలు ఉన్నప్పటికి, దీనికి మొత్తం సెటప్‌ను మళ్లీ తీసుకోవాలి.

కారు ఎగ్జాస్ట్‌ పైప్‌ నుంచి వాటర్ లీక్‌ అవుతోందా? వెంటనే ఈ పని చేయకపోతే అంతే!

డెడ్ పెడల్‌గా ఉపయోగించడం: మీ కారులో డెడ్ పెడల్ లేకపోతే క్లచ్‌ను డెడ్ పెడల్‌గా పరిగణించకూడదనే విషయాన్ని డ్రైవర్ గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. చాలా కార్లలో డెడ్ పెడల్ అందుబాటులో లేదు. ఈ కారణంగా చాలా మంది కారు డ్రైవర్లు లెఫ్ట్​ లెగ్​ను విశ్రాంతి కోసం క్లచ్‌పై ఉంచుతారు. అంటే వారు దానిని డెడ్ పెడల్‌గా యూజ్​ చేస్తారు. దీనివల్ల క్లచ్​ పార్శియల్​గా దెబ్బతిని మైలేజ్​ తగ్గుతుంది.

క్లచ్​ మెయింటెనెన్స్​ కచ్చితంగా ఉండాలి: కారు సర్వీసింగ్​కు ఇచ్చినప్పుడు క్లచ్‌ను కూడా మెయింటెనెన్స్‌ చేయించాలి. దీని ద్వారా దాని లైఫ్​ టైమ్​ కూడా పెరుగుతుంది. క్లచ్‌ను క్రమం తప్పకుండా మెయింటెనెన్స్​ చేయించకపోతే.. దాని జీవితకాలం కూడా తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ కారును సర్వీస్ చేసినప్పుడల్లా, క్లచ్‌ని కూడా చెక్ చేయమని మెకానిక్‌కి చెప్పాలి. దీని ద్వారా ఏదైనా సమస్య ఉన్నా అప్పుడే సాల్వ్​ చేసుకోవచ్చు.

డ్రైవింగ్​​ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!

మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!

కారు టెస్ట్​ డ్రైవ్​కు వెళ్తున్నారా? ఈ విషయాలు మరిచిపోకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.