ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఇలా చేస్తే మరింత లాభం!

author img

By

Published : Apr 18, 2022, 2:30 PM IST

ఆసుపత్రిలో చేరినప్పుడే పరిహారం అందించే ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు సరిపోవడం లేదు. చికిత్స కోసం చేసిన ఖర్చులను పొందినప్పుడే.. పాలసీదారుడు తాను తీసుకున్న 'బీమా'తో ప్రయోజనం పొందుతాడు. ఈ నేపథ్యంలో పాలసీదారుడు నష్టపోకుండా, చికిత్స భారాన్ని తగ్గించుకోవాలంటే.. బీమా తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి.

health insurance
ఆరోగ్య బీమా

ఆరోగ్య అత్యవసరం ఏర్పడిన ప్రతిసారీ వెంటనే ఆసుపత్రిలో చేరకపోవచ్చు. కొన్నిసార్లు చికిత్సకు ముందు వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. ఉదాహరణకు గుండెకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరకముందే.. 2డీ ఎకో, టీఎంటీ, యాంజియోగ్రఫీ అనేక పరీక్షలు ఉంటాయి. వీటికీ వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీటన్నింటినీ చెల్లించేలా బీమా పాలసీ ఉండాలి. వీటిని చెల్లించినప్పుడే పాలసీదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. సొంతంగా భరించాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది తప్పదు.

బీమా పాలసీలోనే భాగంగా క్లెయిం చేసుకోని ఏడాది తర్వాత వైద్య పరీక్షలకు అవకాశం కల్పిస్తున్నాయి బీమా సంస్థలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ వెసులుబాటు ఉన్న బీమా పాలసీల వల్ల పాలసీదారుడికి వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలంలో చికిత్స ఖర్చును తగ్గించేందుకూ ఇది ఉపయోగపడుతుంది.

రోజువారీ చికిత్సలూ ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. కాబట్టి, బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఓపీడీ చికిత్సలకూ పరిహారం ఇచ్చేలా ఉండాలి. దీంతోపాటు ప్రత్యామ్నాయ వైద్య చికిత్స విధానాలకూ బీమా పాలసీ అనుమతించాలి. అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేద, యునాని వంటి వైద్య చికిత్సల వైపు ఇప్పుడు ఎంతోమంది వెళ్తున్నారు. ఇలాంటి చికిత్సల ఖర్చులనూ చెల్లించేలా పాలసీని ఎంచుకోవాలి.

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు.. ఆసుపత్రి గది అద్దెపై పరిమితి విధిస్తుంటాయి. సాధారణంగా ఇది పాలసీ విలువలో 1 లేదా 2 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి పాలసీలు తీసుకున్నప్పుడు రూం రెంట్‌ వైవర్‌ లాంటి అనుబంధ పాలసీలను ఎంచుకోవడం మేలు. ఆసుపత్రిలో చేరేందుకు వచ్చే రవాణా/అంబులెన్స్‌ ఛార్జీలనూ బీమా సంస్థ అందించాలి. ఆసుపత్రిలో చేరినప్పుడు కొన్ని రోజువారీ ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా రోగికి తోడుగా ఉన్నవారికి డబ్బు అవసరం ఉంటుంది. డైలీ క్యాష్‌ బెనిఫిట్‌ లాంటివి తీసుకున్నప్పుడు నిర్ణీత మొత్తాన్ని ముందుగానే పేర్కొన్న రోజులకు అందిస్తారు. దీనివల్ల చేతి నుంచి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.. పెద్ద మొత్తంలో మన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయకుండా ఉంటాం.

- షీనా కపూర్‌, హెడ్‌ మార్కెటింగ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్

ఇదీ చూడండి: Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.