ETV Bharat / business

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. లాభాల చిచ్చుబుడ్లు ఇవే!

author img

By

Published : Oct 23, 2022, 6:55 AM IST

investments in stock market on diwali
investments in stock market

దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2078 సంవత్‌ పూర్తి కాగా, రాబోయే దీపావళి నుంచి 2079 సంవత్‌ ఆరంభం కాబోతోంది. నూతన సంవత్‌కు వివిధ బ్రోకరేజీ సంస్థలు తమదైన అంచనాలతో, పెట్టుబడికి అనుకూలమైన రంగాలు, కంపెనీల షేర్లను సిఫారసు చేశాయి. ఆయా సంస్థలు సూచించిన షేర్లు ఇలా ఉన్నాయి.

వెలుగుల పండుగ దీపావళి. ఉల్లాసం, ఉత్సాహం, వెలుగు జిలుగులు పంచే ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. స్టాక్‌మార్కెట్‌ మదుపరులకు ఇంకా ముఖ్యం. గత ఏడాది కాలంలో తమ పెట్టుబడులపై ఏమేరకు లాభాలు వచ్చాయో సమీక్షించుకుని, వచ్చే దీపావళి నాటికి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి.. ఏఏ రంగాల్లోని కంపెనీలపై పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించుకునే తరుణమిది. గత దీపావళి నాటికి కొవిడ్‌ పరిణామాలు పూర్తిగా తొలగిపోలేదు.

అందువల్ల మార్కెట్‌ ఎక్కువ కాలం దిద్దుబాటుకు గురై, సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అయ్యాయి. గత ఆరు నెలల్లో బ్యాంకులు, రక్షణ రంగ సంస్థలు కొంతమేరకు మదుపరులకు లాభాలు పండించాయి. కానీ సూచీలు ఆకర్షణీయంగా పెరగలేదు. ఐటీ, ఔషధ రంగాలు కుంగిపోయాయి. మౌలిక సదుపాయాల రంగం ఇంకా గాడిలో పడలేదు. స్థూలంగా గత ఏడాది కాలంలో జరిగింది ఇదే. అయితే వచ్చే ఏడాది కాలం ఆశావహంగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని ప్రత్యేకాంశాలు ఇందుకు వీలు కల్పించనున్నాయి.

  • ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశం భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో అమెరికా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అక్కడి స్టాక్‌మార్కెట్‌ సూచీలైన నాస్‌డాక్‌ 32 శాతం, ఎస్‌అండ్‌పీ- 500 సూచీ 24 శాతం, డోజోన్స్‌ 19.5 శాతం నష్టపోయాయి. ఈ సమయంలో మన నిఫ్టీ 8 శాతమే తగ్గడం గమనార్హం.
  • మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుత స్థాయుల నుంచి నిఫ్టీ మరీ ఎక్కువగా పతనం కాకపోవచ్చు. మన ఆర్థిక పరిస్థితులు కొంత సానుకూలంగా ఉండటం దీనికి కారణం. జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, చమురు ధర తగ్గుముఖం పట్టడం సానుకూల అంశాలు.
  • మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన దేశీయ వినియోగం- ప్రైవేటు రంగ సంస్థల విస్తరణ, ఎగుమతులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థిరత్వానికి వచ్చిన భయం కూడా లేదు.
  • మార్కెట్‌ పరంగా చూస్తే, కొద్దికాలంలో వివిధ రంగాల షేర్ల ధరలు బాగా 'దిద్దుబాటు' అయ్యాయి. దేశీయ వినియోగం ఆధారిత కంపెనీలకు ఆదాయాలు- లాభాలు పెరుగుతున్నాయి. బ్యాంకులు కూడా మొండి బాకీలు తగ్గించుకుని బలమైన బ్యాలెన్స్‌ షీట్‌తో స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు ఆకర్షణీయంగా నమోదవుతున్నాయి. వర్షపాతానికి తోడు వ్యవసాయం సానుకూలంగానే ఉంది. ఇవి స్టాక్‌మార్కెట్‌కు కలిసి వచ్చే అంశాలు.
  • వాహన రంగంలో అనూహ్య వృద్ధి అన్ని వర్గాలనూ ఆకర్షిస్తోంది.
  • విదేశీ మదుపర్లు షేర్లు విక్రయిస్తున్నా, స్టాక్‌మార్కెట్‌ పెద్దగా పతనం కావడం లేదు. దీనికి దేశీయ సంస్థలు, ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్ల నుంచి లభిస్తున్న మద్దతు ప్రధాన కారణం. రిటైల్‌ మదుపర్లూ భారీగా పెరగడం గమనార్హం.
  • వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే దీపావళి నాటికి దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఆకర్షణీయంగా పెరుగుతాయని, దేశీయ వినియోగం ఆధారిత కంపెనీలపై పెట్టుబడులు లాభాలు పండిస్తాయని చెప్పొచ్చు. నిఫ్టీ గత ఏడాదిలో నమోదైన 18,605 స్థాయిని త్వరలోనే అధిగమించి, 20,000 దిశగా ముందుకు సాగుతుందని కొన్ని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

సవాళ్లున్నాయ్‌: కొన్ని అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రాక, ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ అయిన యూఎస్‌ ఫెడ్‌ మరింత ఎక్కువగా వడ్డీరేట్లు పెంచినా, లేదా అనూహ్యంగా ఆర్థిక మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తే మాత్రం, దాని ప్రభావం మన మార్కెట్లపై పడుతుంది. ఇప్పటికి అయితే అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు.

దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2078 సంవత్‌ పూర్తి కాగా, రాబోయే దీపావళి నుంచి 2079 సంవత్‌ ఆరంభం కాబోతోంది. నూతన సంవత్‌కు వివిధ బ్రోకరేజీ సంస్థలు తమదైన అంచనాలతో, పెట్టుబడికి అనుకూలమైన రంగాలు, కంపెనీల షేర్లను సిఫారసు చేశాయి. ఆయా సంస్థలు సూచించిన షేర్లు ఇలా ఉన్నాయి.

.

ఇదీ చదవండి: పండగ వేళ.. సిరులు నిండుగా.. దీపావళి ఆర్థిక పాఠాలు నేర్చుకుందామా?

బంగారంపై ఆన్​లైన్​లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఇవి చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.