ETV Bharat / business

Gold Hallmarking 3rd Phase : గోల్డ్​ హాల్​మార్కింగ్ 3వ దశ ప్రారంభం.. ఏపీ, తెలంగాణలో ఎక్కడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 3:53 PM IST

Gold Hallmarking 3rd Phase In Telugu : కేంద్ర ప్రభుత్వం దేశంలోని 55 కొత్త జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై హాల్​మార్కింగ్​ను తప్పనిసరి చేసింది. ఇప్పటికే రెండు దశల్లో ఈ హాల్​మార్కింగ్​ను విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, సెప్టెంబర్​ 8న మూడో దశను ప్రారంభించింది. దీనితో తెలంగాణలోని 4 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్​లోని 5 జిల్లాల్లో గోల్డ్ మార్కింగ్​ తప్పనిసరి అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Gold Hallmarking 3rd Phase in AP and Telangana
Gold Hallmarking 3rd Phase

Gold Hallmarking 3rd Phase : బంగారు ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్​మార్కింగ్​ చేసే మూడో దశ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో ఈ మూడో దశ హాల్​మార్కింగ్​ ప్రక్రియ సెప్టెంబర్​ 8 నుంచి అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది.

బంగారం స్వచ్ఛతను తెలుపుతుంది!
How To Check Gold Purity : గోల్డ్​ హాల్​మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. వాస్తవానికి 2021 జూన్​ 16 వరకు బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్​మార్క్​ ఉండాలనే నిబంధన ఉండేది కాదు. దీనితో కేంద్ర ప్రభుత్వం దీనిని దశలవారీగా, తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది.

మూడు దశల్లో..
Gold Hallmarking Phases In India :

  • 2021 జూన్ 23న మొదలైన తొలిదశలో దేశంలోని 343 జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై గోల్డ్ హాల్​మార్కింగ్ తప్పనిసరి చేశారు.
  • 2022 ఏప్రిల్ 4న ప్రారంభమైన రెండో దశలో దేశంలోని 256 + 32 జిల్లాల్లో హాల్​మార్కింగ్ తప్పనిసరి చేశారు.
  • వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 2023 సెప్టెంబర్​ 8న మూడో దశ ప్రారంభమైంది. ఈ దశలో దేశంలోని 55 కొత్త జిల్లాల్లో పసిడి ఆభరణాలపై హాల్​మార్కింగ్ తప్పనిసరి చేశారు.

ఏపీ, తెలంగాణల్లో..
ఆంధ్రప్రదేశ్​లోని 5 జిల్లాలు, తెలంగాణలోని 4 జిల్లాల్లో ఈ మూడో దశ గోల్డ్ హాల్​మార్కింగ్​ ప్రక్రియ సెప్టెంబర్​ 8తో మొదలైంది.

  • ఆంధ్రప్రదేశ్​లోని జిల్లాలు : అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్​ కోనసీమ, ఏలూరు, ఎన్​టీఆర్​, నంద్యాల్​ జిల్లాలు.
  • తెలంగాణలోని జిల్లాలు : మేడ్చల్​ - మల్కాజ్​గిరి, నిజామాబాద్​, కరీంనగర్​, మెహబూబ్​నగర్​.

రాష్ట్రాలు - జిల్లాలు
మూడో దశలో.. బిహార్​ - 8, ఆంధ్రప్రదేశ్​ - 5, ఉత్తరప్రదేశ్​ - 5, మహారాష్ట్ర - 5, తెలంగాణ - 4, హరియాణ - 3, జమ్ము కశ్మీర్​ - 3, పంజాబ్​ - 3, కర్ణాటక - 3, తమిళనాడు - 3, అసోం - 2, గుజరాత్ - 2, ఝార్ఖండ్​ - 2, మధ్యప్రదేశ్​ - 2, ఉత్తరాఖండ్​ - 2, బంగాల్​ - 2, రాజస్థాన్​ - 1 జిల్లాల్లో గోల్డ్ హాల్​మార్కింగ్ తప్పనిసరి చేశారు.

విజయవంతంగా..
BIS Hallmark In India : బ్యూరో ఆఫ్ ఇండియన్​ స్టాండర్డ్స్​ (BIS) మొదటి రెండు దశల్లో గోల్డ్ హాల్​మార్కింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. దాదాపుగా ప్రతి రోజూ 4 లక్షల బంగారు ఆభరణాలపై 'హాల్​మార్క్ యూనిక్​ ఐడెంటిఫికేషన్​' (HUID) హాల్​మార్క్ వేయడం జరిగింది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 'గోల్డ్ హాల్​మార్కింగ్​ తప్పనిసరి చేసినప్పటి నుంచి.. రిజిస్టర్డ్​ నగల వ్యాపారుల సంఖ్య 34,647 నుంచి ఏకంగా 1,81,590 మందికి పెరిగింది. అలాగే బంగారం పరీక్ష కేంద్రాలు, హాల్​మార్కింగ్ కేంద్రాలు (AHCs) కూడా 945 నుంచి 1,471కి పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు దేశంలో 26 కోట్లకు పైగా పసిడి ఆభరణాలపై హాల్​మార్కింగ్ జరిగింది.'

వినియోగదారులు బంగారం నాణ్యతను ఎలా చెక్ చేసుకోవాలి?
How To Check Gold Quality In BIS Care App : వినియోగదారులు బంగారం ఆభరణాలు కొనేముందు..

1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి BIS Care Appను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

2. యాప్​లో బంగారం ఆభరణంపై ఉన్న HUID నంబర్​ను ఎంటర్​ చేయాలి.

3. HUID నంబర్​ ఎంటర్ చేసి, Verify HUID పై క్లిక్ చేయాలి.

4. వెంటనే మీకు సదరు ఆభరణంలోని బంగారం స్వచ్ఛత వివరాలు కనిపిస్తాయి.

అవగాహన పెరిగింది!
BIS Care App Downloads : వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 2021 నుంచి 2023 మధ్యలో గూగుల్ ప్లేస్టోర్​ నుంచి BIS Care App డౌన్​లోడ్​ చేసుకున్నవారి సంఖ్య 2.3 లక్షల నుంచి ఏకంగా 12.4 లక్షలకు పెరిగింది. అలాగే ఒక కోటి మందికి పైగా హెచ్​యూఐడీని వెరిఫికేషన్ చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.