ETV Bharat / business

How to Check PF Balance in UMANG App : మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బుంది..? సింపుల్​గా చెక్ చేసుకోండి..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 2:53 PM IST

How to Check PF Balance in UMANG App : మీకు పీఎఫ్ అకౌంట్‌ ఉందా..? అయితే అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చిటికెలో మీ మొబైల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి..!

How to Check EPF Balance in UMANG App
How to Check PF Balance in UMANG App

How to Check PF Details in UMANG App : ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు.. ప్రతి నెలా తమ జీతంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. దానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ లేదా యజమాని జమ చేస్తారు. ఈ క్రమంలో వారి పీఎఫ్ అకౌంట్​లో(PF Balance) జమ అయిన నగదును చందాదారులు చెక్​ చేసుకోవాలంటే గతంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అలాగే వైద్య, విద్య ఖర్చులు లేదా ఇంటి మరమ్మతుల వంటి అత్యవసర ఖర్చుల కోసం PF ఖాతా నుంచి డబ్బును విత్​డ్రా చేసుకోవాలన్నా.. బ్యాంక్ లేదా పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సింపుల్​గా మీరు ఉన్న చోటు నుంచే మీ పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు.

Check EPF Balance with UMANG App in Telugu : ఈ సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్​వో 'UMANG' అనే మొబైల్ యాప్​ను తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO).. ఈ యాప్​ ద్వారా చందాదారులు పీఎఫ్ వివరాలను సులభంగా తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే.. ఈ UMANG(Unified Mobile Application for New age Governance) యాప్ ద్వారా ఈపీఎఫ్(EPF) వివరాలను చెక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు మొదట తమ యూఏఎన్‌(UAN)ని యాక్టివేట్ చేసి.. మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నామా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN)ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జారీ చేస్తోంది. మీరు ఎన్నిసార్లు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు మారినా.. మీకు ఒకే యూఏఎన్ నంబర్ ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా మీ పీఎఫ్ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

How to Check PF Balance in UMANG App : ఉమాంగ్ యాప్
How to Check PF Balance in UMANG App : ఉమాంగ్ యాప్

How to Check EPF Details with Umang App :

ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా మీ PF వివరాలు ఇలా చెక్​ చేసుకోండి..

  • మొదట మీరు ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్​ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఫోన్​లో యాప్​ను ఓపెన్ చేసి EPFOను ఎంచుకోవాలి.
  • అనంతరం 'Employee Centric Services' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 'View Passbook' ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ UAN నంబర్​ను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు OTP వస్తుంది.
  • ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన 'Login' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆపై మీరు EPF బ్యాలెన్స్‌ని చెక్ చేయాలనుకుంటున్న కంపెనీ సభ్యుల IDని ఎంచుకోవాలి.
  • అప్పుడు మీ EPF బ్యాలెన్స్‌ వివరాలతో పాటు మీ పాస్‌బుక్ స్క్రీన్‌పై డిస్​ప్లే అవుతుంది. ఇలా మీ పీఎఫ్ వివరాలు తెలుసుకుని పాస్​బుక్​ కావాలంటే డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కావాల్సిన డబ్బును విత్​ డ్రా కూడా చేసుకోవచ్చు.

PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్​గా చెక్ చేసుకోండి!

Multiple EPF Accounts Merge : వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా?.. వెంటనే వాటిని మెర్జ్​ చేసుకోండి!

EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్​ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.