ETV Bharat / business

మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 ఈజీ మార్గాలు ట్రై చేయండి!

author img

By

Published : Jul 28, 2023, 9:54 AM IST

PF Check Online : ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ను తెలుసుకునేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సులువుగా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఆ నాలుగు మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.

How To Check PF Balance Online
మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా ఇలా తెలుసుకోవచ్చు.. ఈ నాలుగు మార్గాలతో మరింత ఈజీగా..

PF Balance Check : ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పొదుపు ఖాతా వల్ల ఉద్యోగులకు ఒక భరోసా ఉంటుంది. పదవీ విరమణ తర్వాత లేదా భవిష్యత్తులో ఏదైనా అవసరాలకు ఈపీఎఫ్ నిధులు చాలా ఉపయోగపడతాయి. ఈపీఎఫ్ వల్ల ఉద్యోగులకు ఆర్ధిక భద్రత కూడా లభిస్తుంది.

ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా సులువుగా మీ ఖాతాలో ఇప్పటివరకు ఎంత నగదు జమ అయిందో ఎప్పటికప్పుడు సులువుగా తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్, ఎస్​ఎమ్​ఎస్​, ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ పోర్టల్, ఉమంగ్ మొబైల్ ఆప్లికేషన్ ద్వారా సులువుగా మీ పీఎఫ్​ బ్యాలెన్స్‌ను​ చూసుకోవచ్చు.

ఒక్క మిస్డ్ కాల్​తో..
PF Balance Check Number : మీరు ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను యాక్టివేట్ చేసి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఖాతాలోని బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 011-22901406 నంబర్‌కు ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌లో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్‌ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగ్‌ల తర్వాత మీ కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొద్దిసేపటికి మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ను టెక్ట్స్ మెసేజ్ రూపంలో పొందుతారు.

టెక్ట్స్ మెస్సేజ్​తో..
PF Balance Through SMS : రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఒక్క ఎస్​ఎమ్​ఎస్ పంపడం ద్వారా కూడా మీరు మీ పీఎఫ్​ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 'EPFOHO' అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ స్పేస్ ఇవ్వాలి.. తర్వాత మీకు ఏ భాషలో కావాలనేది మొదటి మూడు పదాలను ఎంటర్ చేయాలి. ఇంగ్లిష్‌లో కావాలంటే ENG అని టైప్ చేయాలి. EPFOHO UAN ENG విధానంలో టైప్ చేసిన తర్వాత 7738299899 నంబర్‌కు మెసేజ్​ పంపాలి. ఇలా పంపిన నిమిషంలోపే మీ మొబైల్ నెంబర్‌కు టెక్ట్స్ సందేశం రూపంలో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

వెబ్‌సైట్ ద్వారా బ్యాలెన్స్​..
PF Balance Through Portal : ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ ద్వారా కూడా మీ బ్యాలెన్స్ వివరాలతో పాటు మీ పాస్‌బుక్‌ను పొందవచ్చు. పాస్‌బుక్ ద్వారా బ్యాలెన్స్‌తో పాటు ఏ నెలలో ఎంత నగదు జమ అయ్యింది? నగదుపై ఎంత వడ్డీ జమ అయింది? అనే వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత 'అవర్ సర్వీసెస్' అనే సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో 'ఫర్ ఎంప్లాయీస్' అనే ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత సర్వీసెస్​ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత Member Passbookను ఎంచుకోవాలి. ఆ తర్వాత UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఉమంగ్​ యాప్‌తో..
PF Balance Umang App : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమంగ్ యాప్ సహాయంతో కూడా మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అందులో కనిపించే ఈపీఎఫ్‌ఓ అనే ఆప్షన్‌ను ఎంచుకుని బ్యాలెన్స్ వివరాలు, పాస్‌బుక్‌ను చూసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.